Hockey World Cup 2023 : ఫుట్‌బాల్ సంబరం ముగిసింది. అభిమానులను అలరించేందుకు మరో గోల్ ఆట వచ్చేస్తోంది. హాకీ ప్రపంచకప్ ఒడిశా వేదికగా ఈ నెల 13న ఆరంభమవుతుంది. 16 జట్లు.. నాలుగు పూల్‌లుగా విడిపోయి తలపడనున్నాయి. భువనేశ్వర్, రూర్కెలాలో మ్యాచ్‌లు జరుగుతాయి. 29న ఫైనల్‌ను నిర్వహిస్తారు. 2018లోనూ భారత్‌లో జరిగిన ఈ ప్రపంచకప్‌లో బెల్జియం విశ్వ విజేతగా నిలిచింది. 2022లో జరగాల్సిన ఈ టోర్నీని కొన్ని కారణాల వల్ల ఈ ఏడాది నిర్వహిస్తున్నారు.
16 జట్లు.. ఒకే కప్పు.. 17 రోజుల పాటు కిక్కే కిక్కు! - హాకీ వరల్డ్ కప్ 2023 టీమ్స్
Hockey World Cup 2023 : చేతిలో స్టిక్.. బంతిపై కళ్లు.. ఎదురుగా లక్ష్యం.. మధ్యలో ప్రత్యర్థి ఆటగాళ్లు.. అడ్డంకులను దాటి చేసే గోల్స్.. ఇలా మరోసారి హాకీ మాయలో అభిమానులను ముంచెత్తేందుకు పురుషుల ప్రపంచకప్ వచ్చేస్తోంది. భారత్ ఆతిథ్యమిస్తున్న ఈ విశ్వ సమరానికి శుక్రవారమే తెరలేవనుంది. 16 జట్లు.. ఒక్క కప్పు. ఇక హారాహోరీ కిక్కే కిక్కు!
ఫార్మాట్ ఇలా..:ప్రతి పూల్‌లోని జట్టు.. మిగతా మూడు జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. ఆ మ్యాచ్‌లన్నీ పూర్తయ్యే సరికి పూల్‌లో అగ్రస్థానంలో నిలిచిన జట్టు నేరుగా క్వార్టర్స్ చేరుతుంది. ఇలా నాలుగు పూల్‌ల నుంచి నాలుగు జట్లు క్వార్టర్స్‌లో అడుగుపెడతాయి. ఒక్కో పూల్‌లో రెండు, మూడు స్థానాల్లో నిలిచే జట్లు.. క్రాస్ ఓవర్స్‌లో తలపడేందుకు అర్హత సాధిస్తాయి. ఈ క్రాస్ ఓవర్స్‌లో ఒక పూల్‌లోని జట్లు.. మరో పూల్‌లోని జట్లతో నాకౌట్ మ్యాచ్‌ల్లో పోటీపడతాయి. అందులో నుంచి మరో నాలుగు జట్లు క్వార్టర్స్ చేరతాయి. అనంతరం సెమీస్, ఫైనల్స్ వరుసగా జరుగుతాయి.
పూల్- ఎ:అర్జెంటీనా, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, దక్షిణాఫ్రికా
పూల్- బి:బెల్జియం, జర్మనీ, జపాన్, కొరియా
పూల్- సి:చిలీ, మలేసియా, నెదర్లాండ్స్, న్యూజిలాండ్
పూల్- డి:ఇంగ్లాండ్, భారత్, స్పెయిన్, వేల్స్
- 14
ఇప్పటి వరకూ జరిగిన పురుషుల హాకీ ప్రపంచకప్‌లు. 1971లో ఈ టోర్నీ ఆరంభమైంది. మొదట్లో రెండేళ్లకోసారి జరిగిన ఈ టోర్నీని.. ఆ తర్వాత నాలుగేళ్లకోసారి నిర్వహిస్తున్నారు. - 4
పురుషుల హాకీ ప్రపంచకప్‌కు భారత్ ఆతిథ్యమివ్వడం ఇది నాలుగోసారి. 1981-82, 2010, 2018లోనూ ఈ మెగా టోర్నీ ఇక్కడే జరిగింది. - 14
టోర్నీ చరిత్రలో అత్యధికంగా పాకిస్థాన్ గెలిచిన టైటిళ్లు. కానీ ఈ సారి ప్రపంచకప్‌కు అర్హత సాధించడంలో పాక్ విఫలమైంది. 2022 ఆసియా కప్‌లో తొలి నాలుగు స్థానాల్లో ఆ జట్టు నిలవలేకపోయింది. నెదర్లాండ్స్, ఆస్ట్రేలియా చెరో మూడు సార్లు ప్రపంచకప్ విజేతలుగా నిలిచాయి. - 1
ఇప్పటివరకూ భారత్ ఒక్కసారి మాత్రమే విశ్వవిజేతగా నిలిచింది. 1975లో టీమ్‌ఇండియా కప్పు కొట్టింది. 1973లో రన్నరప్‌గా, 1971లో మూడో స్థానంలో నిలిచింది.