తెలంగాణ

telangana

ETV Bharat / sports

ప్రపంచ ఛాంపియన్​షిప్​లో హిమదాస్​కు చోటు - athlet himadas

ప్రపంచ అథ్లెటిక్స్​​ ఛాంపియన్​షిప్​లో స్టార్​ స్ప్రింటర్​ హిమదాస్​కు చోటు దక్కింది. భారత అథ్లెటిక్స్​ సమాఖ్య(ఏఎఫ్​ఐ​) విడుదల చేసిన 25 మంది జాబితాలో ఆమె పేరు ఖరారైంది. ఈ నెల 27 నుంచి దోహా వేదికగా ఆటలు ప్రారంభం కానున్నాయి.

ప్రపంచ ఛాంపియన్​షిప్​లో హిమదాస్​కు చోటు

By

Published : Sep 10, 2019, 1:22 PM IST

Updated : Sep 30, 2019, 2:57 AM IST

వరుస పతకాలతో సంచలనం సృష్టిస్తోన్న భారత యువ అథ్లెట్​​ హిమదాస్​ మరో ప్రఖ్యాత టోర్నీలో సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది. సెప్టెంబర్​ 27 నుంచి దోహా వేదికగా జరగనున్న ప్రపంచ అథ్లెటిక్స్​ ఛాంపియన్​షిప్​లో ఆమె పాల్గొననుంది.మహిళల 4X400 మీటర్ల రిలే, మిక్స్​డ్​ విభాగంలో బరిలోకి దిగనుంది. 400మీటర్ల పోటీల్లో మాత్రం హిమదాస్​ అర్హత సాధించలేదు.

తాజాగా ఈ టోర్నీ కోసం 25 మందితో జాబితాను ప్రకటించింది భారత అథ్లెటిక్స్​ సమాఖ్య. తొలుత హిమదాస్​ పేరు లేకపోయినా..క్రీడాకారుల సంఖ్య పెంచుకోవచ్చని అంతర్జాతీయ అథ్లెటిక్​ ఫెడరేషన్​ ఆదేశాలివ్వగా తాజాగా ఈ క్రీడాకారిణికి చోటు లభించింది. హిమదాస్​తో పాటు అదే విభాగాల్లో పూవమ్మ చోటు దక్కించుకుంది. 200 మీటర్లలో సుశీంత్రన్​, హై జంప్​లో తేజస్వినీ శంకర్​ స్థానం పొందారు.

మోచేతికి శస్త్రచికిత్స చేయించుకున్న జావెలిన్‌ త్రో క్రీడాకారిణి నీరజ్ చోప్రా ఎంపికపై త్వరలో సెలక్టర్లు చర్చించనున్నారని ఏఎఫ్‌ఐ ప్రకటించింది. అలాగే 400మీటర్ల వ్యక్తిగత విభాగం కోసం ఈ నెల 21న స్ప్రింటర్​ అంజలీ దేవికి అర్హత పోటీలు నిర్వహించనున్నారు.

జట్ల వివరాలు..

  • పురుషులు: జబీర్​ ఎంపీ(400 మీటర్ల హర్డిల్స్​), జిన్​సన్​ జాన్సన్​(1500 మీ), అవినాశ్​ సాబ్లే(3వేల మీ స్టీపుల్​చేజ్​), కేటీ ఇర్ఫాన్​, దేవేందర్​ సింగ్​(20కిమీ వాకింగ్​), గోపీ(మారథాన్​), శ్రీ శంకర్​(లాంగ్​ జంప్​), తజిందర్​ పాల్​ సింగ్​(షాట్​పుట్​), శివపాల్​ సింగ్​(జావలిన్​ త్రో), అనాస్​, నిర్మల్​ టామ్​, అలెక్స్​, అమోజ్​ జాకబ్​, కేఎస్​ జీవన్​, ధరున్​ అయ్యస్వామి, హర్ష కుమార్​(4X400మీ వ్యక్తిగత, మిక్స్​డ్​).
  • మహిళలు: పీయూ చిత్ర(1500 మీ), అన్ను రాణి(జావలిన్​ త్రో), హిమదాస్​, విశ్మయ, పూవమ్మ, జిశ్న మాథ్యూ, రేవతి, శుభ వెంకటేశన్​, విత్య(4X400 మీ వ్యక్తిగత, మిక్స్​డ్​)

ఇదీ చదవండి...

Last Updated : Sep 30, 2019, 2:57 AM IST

ABOUT THE AUTHOR

...view details