తెలంగాణ

telangana

ETV Bharat / sports

'హిమ' పాంచ్​ పటాకా- నెలలో 5 స్వర్ణాలు - five

హిమదాస్ ఐదో స్వర్ణాన్ని తన ఖాతాలో వేసుకుంది. చెక్ ​రిపబ్లిక్​లో జరిగిన అథ్లెట్ మీట్​లో 400 మీటర్ల విభాగంలో 52.09 సెకన్లలో రేసు పూర్తి చేసింది.

హిమదాస్

By

Published : Jul 21, 2019, 8:02 AM IST

Updated : Jul 21, 2019, 9:48 AM IST

ఈ నెలలో ఇప్పటికే 4 స్వర్ణాలు సాధించిన భారత స్ప్రింటర్ హిమదాస్ మరో పసిడిని తన ఖాతాలో వేసుకుంది. చెక్ రిపబ్లిక్​లో జరిగిన అథ్లెట్ మీట్​లో 400 మీటర్ల విభాగంలో బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. 52.09 సెకన్లలో పరుగు పూర్తి చేసి ఈ సీజన్ అత్యుత్తమ రికార్డు నెలకొల్పింది.

అయితే స్వర్ణాన్ని నెగ్గినా.. సెప్టెంబరులో జరిగే వరల్డ్​ ఛాంపియన్​షిప్స్​కు అర్హత సాధించ లేకపోయింది. క్వాలిఫై కావాలంటే 51.88 సెకన్లలో పరుగు పూర్తి చేయాలి. కానీ 52.09 సెకన్లతో తృటిలో అవకాశాన్ని కోల్పోయింది. గత ఏప్రిల్​లో వెన్నునొప్పితో 400 మీటర్ల రేసుకు దూరమైన హిమ పునరాగమంలో సత్తాచాటింది.

  • జులై 2న పొలాండ్​లో జరిగిన పొజ్నాన్ అథ్లెటిక్స్​ గ్రాండ్ ప్రిక్స్​లో (23.65) 200మీ విభాగంలో తొలి స్వర్ణాన్ని కైవసం చేసుకుందీ అసోం స్ప్రింటర్.
  • జులై 7న కుట్నో అథ్లెట్ మీట్​లో 200 మీటర్ల (23.97) విభాగంలో మరో బంగారు పతకాన్ని సొంతం చేసుకుంది.
  • జులై 13న క్లాద్నో అథ్లెట్ మీట్​లో 200మీటర్ల విభాగంలోనే మూడో స్వర్ణం చేజిక్కించుకుంది. 23.43 సెకన్లలో రేసు పూర్తి చేసింది.
  • బుధవారం చెక్​ రిపబ్లిక్​లో జరిగిన టాబోర్ అథ్లెట్​ మీట్​లో నాలుగో పసిడిని కైవసం చేసుకుంది.

400మీ హర్డిల్స్​ విభాగంలో జబీర్​ కూడా బంగారు పతకాన్ని సొంతం చేసుకున్నాడు. 200 మీటర్ల రేసులో మొహమ్మద్ అనాస్ 20.95 సెకన్లలో పరుగుపూర్తి చేసి మూడో స్థానంలో నిలిచాడు.

ఇది చదవండి: ప్రపంచ ఛాంపియన్​షిప్​ కోసం రెజ్లర్ల ఎంపిక

Last Updated : Jul 21, 2019, 9:48 AM IST

ABOUT THE AUTHOR

...view details