Himadas Suspended : భారత స్టార్ అథ్లెట్ హిమదాస్ షాకిచ్చింది నాడా(నేషనల్ ఆంటీ డోపింగ్ ఏజెన్సీ). ఆమెను తాత్కాలికంగా సస్పెండ్ చేసి బ్యాన్ విధించింది. డోపింగ్ టెస్టులకు ఆమె అందుబాటులో లేని కారణంగా ఈ శిక్ష విధించినట్లు పేర్కొంది. 12 నెలల వ్యవధిలో ఆమె మూడుసార్లు ఈ టెస్ట్‌లకు గైర్హాజరు అయినందు వల్ల ఈ చర్య తీసుకున్నారు అధికారులు.
"ఒక ఏడాది కాలంలో హిమదాస్.. ముడు సార్లు డోపింగ్ టెస్ట్‌లకు హాజరుకాలేదు. అందుకే ఆమెను తాత్కాలికంగా సస్పెండ్ చేస్తున్నాం" అని ఓ అధికారి తెలిపారు. సాధారణంగా హిమదాస్ చేసిన తప్పునకు గానూ రెండేళ్ల పాటు శిక్షను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కానీ ఆమెకు ఏడాది కాలానికి శిక్షను తగ్గించే అవకాశం ఉందని తెలిసింది. కాగా, ఈ 23 ఏళ్ల అస్సాం రన్నర్.. ఈ ఏడాది ప్రారంభంలో తగిలిన కాలి గాయం కారణంగా.. హాంగ్జౌ ఆసియా క్రీడల్లో పాల్గొనే అర్హత కోల్పోయింది. ఈ బిగ్ ఈవెంట్‌కు ఆమె దూరమవ్వడం పెద్ద షాక్ లాంటిదే. ఈ క్రీడలు సెప్టెంబరు 23 నుంచి అక్టోబరు 8 వరకు జరగనున్నాయి.