Highest Football Stadium: కేంద్ర పాలిత ప్రాంతం లద్ధాఖ్‌లో అత్యంత ఎత్తైన ప్రదేశంలో సాకర్ మైదానం ఏర్పాటు చేశారు. అత్యాధునిక సదుపాయాలు ఉండేలా దీన్ని తీర్చిదిద్దారు. దేశంలోనే ఇది అత్యంత ఎత్తైన ఫుట్‌బాల్ స్డేడియం.
ఈ మైదానం ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్లకు కూడా ఉపయోగపడేలా తీర్చిదిద్దారు. దీన్ని సముద్రమట్టానికి పది వేల అడుగుల ఎత్తులో నిర్మించారు. ఇందులో 30 వేల మంది ప్రేక్షకుల కూర్చునేలా గ్యాలరీలు నిర్మిస్తున్నారు. ఈ స్డేడియం అంచనా వ్యయం 10.68 కోట్లు. అంతర్జాతీయ ఫుట్‌బాల్ సంఘం ఫిఫా కూడా లద్ధాఖ్ ఫుట్‌బాల్ గ్రౌండ్‌కు గ్నీన్ సిగ్నల్ ఇచ్చింది.