తెలంగాణ

telangana

ETV Bharat / sports

"చావు కోసం చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నా" - Mike Tyson news 2020

జీవితంలో చనిపోవడం కంటే జీవించడమే చాలా కష్టమని అభిప్రాయపడ్డాడు ప్రపంచ దిగ్గజ బాక్సర్​ మైక్​ టైసన్​. ప్రస్తుతం చావు కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నా అంటూ కీలక వ్యాఖ్యలు చేశాడు.

Heavyweight legend Mike Tyson said that he is more willing to die than live
చావు కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నా..!

By

Published : Mar 20, 2020, 6:39 AM IST

చావంటే భయం లేదని, అందుకోసం ఎదురుచూస్తున్నానని ప్రపంచ ప్రఖ్యాత బాక్సర్‌ మైక్‌ టైసన్‌ అన్నాడు. 'ద స్పోర్ట్స్‌మన్‌' అనే వెబ్‌సైట్‌తో మాట్లాడిన ఆయన.. జీవితమంటే పోరాటమని చెప్పాడు. మన గురించి ఎంత తెలుసుకుంటామో జీవితం గురించి అంతే తెలుసుకుంటామని తెలిపాడు.

"జీవితం చాలా ఆసక్తిగా ఉంటుంది. మనకు తెలియకుండానే పుట్టాము. ఎక్కడి నుంచి వచ్చామో కూడా తెలియకుండానే కన్నుమూస్తాము. కానీ, మన జీవితం.. చావుకు సిద్ధం చేస్తుంది. దాని గురించి మనకు తెలియకున్నా.. ఒక వయసు వచ్చాక చావంటే భయం ఉండదు" అని మాజీ బాక్సర్‌ చెప్పాడు.

ABOUT THE AUTHOR

...view details