తెలంగాణ

telangana

ETV Bharat / sports

'క్షమాపణలకు ఓకే.. రాజీనామాకు మాత్రం నో' - japan

టోక్యో ఒలింపిక్స్​ కమిటీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలంటూ తనపై వస్తున్న ఒత్తిళ్లకు స్పందించారు యోషిరో మోరి. ఎట్టి పరిస్థితుల్లో రాజీనామా చేయబోనని స్పష్టం చేశారు.

Head of Tokyo Games won't resign after statement about women
అధ్యక్ష పదవికి రాజీనామా చేయను: యోషిరో మోరి

By

Published : Feb 4, 2021, 2:57 PM IST

టోక్యో ఒలింపిక్స్​ ఆర్గనైజింగ్​ కమిటీ అధ్యక్ష పదవికి తాను రాజీనామా చేయబోనని యోషిరో మోరి స్పష్టం చేశారు. మహిళలను అవమానించేలా చేసిన వ్యాఖ్యల విషయంలో తనపై ఒత్తిడి ఉన్నప్పటికీ పదవిని విడిచేది లేదని తేల్చి చెప్పారు.

'ఇటీవల సమావేశాల్లో మహిళలు ఎక్కువగా మాట్లాడుతున్నారు. రాజకీయాల్లో, బోర్డు మీటింగుల్లో వారికి ప్రాధాన్యం పెరిగింది' అంటూ జపాన్​ ఒలింపిక్​ కమిటీ బోర్డు డైరెక్టర్ల ఆన్​లైన్​ సమావేశంలో యోషిరో వ్యాఖ్యలు చేశారు. ఈయన మాటాలు జపాన్​లో తీవ్ర దుమారమే రేపాయి.

"నేను గత ఏడేళ్ల నుంచి చాలా కష్టపడుతున్నాను. వెనకడుగు వేయబోను. రాజీనామా చేసే ఆలోచన లేదు" అని యోషిరో మోరి తెలిపారు.

మహిళలను అగౌరవపరిచే ఉద్దేశం తనకు లేదని తెలిపారు మోరి. తాను చేసిన వ్యాఖ్యల పట్ల అవసరమైతే క్షమాపణలు చెప్తానన్నారు. కానీ ఎక్కువ మంది కోరుతున్నట్లుగా రాజీనామా మాత్రం చేయబోనని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:భారత్​తో తొలి రెండు టెస్టులకు క్రావ్లీ దూరం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details