టోక్యో ఒలింపిక్స్లో పాల్గొంటున్న తమ రాష్ట్ర అథ్లెట్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది హరియాణా ప్రభుత్వం. రానున్న ఒలింపిక్స్లో బంగారు పతకం సాధిస్తే.. రూ.6 కోట్లను నజరానాగా ఇవ్వనున్నట్లు తెలిపింది. దీంతో పాటు ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇవ్వనున్నట్లు పేర్కొంది.
సిల్వర్ మెడల్ గెలిచిన వారికి రూ.4 కోట్లు, కాంస్య పతక విజేతలకు రూ.2.5 కోట్లు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఒలింపిక్ డే సందర్భంగా పాల్గొన్న కార్యక్రమంలో రాష్ట్ర క్రీడా మంత్రి సందీప్ సింగ్ ఈ విషయాన్ని వెల్లడించారు. రానున్న టోక్యో ఒలింపిక్స్లో తమ రాష్ట్రం నుంచి 30 మంది ప్లేయర్లు పాల్గొంటున్నారని తెలిపారు. వీరి శిక్షణ కోసం ప్రభుత్వం ఒక్కొక్కరికీ రూ.5 లక్షల చొప్పున కేటాయించిందని పేర్కొన్నారు.