తెలంగాణ

telangana

ETV Bharat / sports

వరల్డ్​కప్​లో భారత్​కు భారీ ఎదురుదెబ్బ​.. హార్దిక్ దూరం! - hardik singh hockey world cup 2023

ప్రపంచకప్​లో భారత్‌కు బిగ్​ షాక్ తగిలింది. కీలక ప్లేయర్ హార్దిక్​ టోర్నీకి దూరమయ్యాడు.

Hardik  Singh ruled out of Hockey  World cup
భారత్​కు బిగ్​ షాక్​.. వరల్డ్​కప్​కు హార్దిక్ దూరం

By

Published : Jan 17, 2023, 11:57 AM IST

పురుషుల హాకీ ప్రపంచకప్​లో భారత్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. మిడ్‌ఫీల్డర్‌ హార్దిక్ సింగ్ గాయం కారణంగా మిగిలిన టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. ఇటీవలే ఇంగ్లాండ్​తో జరిగిన మ్యాచ్‌లో హార్దిక్ తొడ కండరాల గాయంతో బాధపడ్డాడు. ఆ​ మ్యాచ్‌ అనంతరం హర్దిక్‌ను ఆస్పత్రికి తరలించారు. అనంతరం వైద్యులు స్కానింగ్‌ చేయగా.. అతడి గాయం తీవ్రంగా ఉన్నట్లు రిపోర్టులు వచ్చాయి. ఇక అతడి స్థానం భర్తీపై ఇంకా మేనేజ్‌మెంట్ కూడా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని సమాచారం.

కాగా హార్దిక్‌.. భారత జట్టులో కీలక ప్లేయర్​గా కొనసాగుతున్నాడు. స్పెయిన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో అతడు అద్భుతమైన గోల్‌తో మెరిశాడు. అదే విధంగా ఇంగ్లాండ్​ మ్యాచ్‌లో కూడా గోల్‌ సాధించేందుకు తీవ్రంగా ప్రయత్నించాడు. ఇకపోత్​ గ్రూపు-డీలో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న భారత్​.. తమ తదుపరి మ్యాచ్‌ను జనవరి 19న వేల్స్​తో ఆడనుంది.

ఇదీ చూడండి:ఎన్టీఆర్​తో టీమ్​ఇండియా​ సందడి.. ఫొటో చూశారా?

ABOUT THE AUTHOR

...view details