ఆసియా వెయిట్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో సరికొత్త రికార్డు నెలకొల్పడం సంతోషంగా ఉందని తెలిపింది భారత వెయిట్ లిఫ్టర్ మీరాబాయ్ చాను. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా పేర్కొంది. క్లీన్ అండ్ జెర్క్ విభాగంలో 119 కేజీల బరువును ఎత్తిన చాను.. గతంలో చైనా క్రీడాకారిణి జియాంగ్(118 కేజీ) పేరిట ఉన్న రికార్డును అధిగమించింది. దీంతో పాటు కాంస్య పతకం సాధించింది.
"ఆసియా ఛాంపియన్షిప్ పోటీల్లో నా ప్రదర్శన పట్ల సంతోషంగా ఉన్నాను. నాపై ప్రేమతో పాటు మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. నిరంతరం కష్టపడుతూ నన్ను నేను మెరుగుపరుచుకుంటాను."
-మీరాబాయ్ చాను, భారత వెయిట్ లిఫ్టర్.
ఇదీ చదవండి:భారత బాక్సర్ల సత్తా- క్వార్టర్స్‌లో ఐదుగురు