తెలంగాణ

telangana

ETV Bharat / sports

బ్రిటీష్​ గ్రాండ్​ ప్రి టైటిల్​ గెలిచిన హామిల్టన్​ - బ్రిటీష్​ గ్రాండ్​ ప్రి ఫైనల్​ న్యూస్​

బ్రిటీష్​ గ్రాండ్​ ప్రి టైటిల్​ను వరుసగా ఏడోసారి సొంతం చేసుకున్నాడు ప్రపంచ ఛాంపియన్​ లూయిస్​ హామిల్టన్. ఆదివారం జరిగిన రేసులోని చివరి ల్యాప్​లో తన కారు టైరు పంక్చర్​ అయినా.. తిరిగి వేగం పెంచుకుని గమ్యస్థానాన్ని చేరుకున్నాడు. ఈ గెలుపుతో 87వ గ్రాండ్​ ప్రి టైటిల్​ను ఖాతాలో వేసుకున్నాడు హామిల్టన్​. ​

Hamilton limps to seventh British Grand Prix victory after late tyre drama
బ్రిటీష్​ గ్రాండ్​ ప్రి టైటిల్​ను గెలుచుకున్న హామిల్టన్​

By

Published : Aug 3, 2020, 8:23 AM IST

ఫార్ములావన్‌ ప్రపంచ ఛాంపియన్‌ లూయిస్‌ హామిల్టన్‌ (బ్రిటన్‌) కొత్త సీజన్లో దూసుకెళ్తున్నాడు. సొంతగడ్డపై తనకు అచ్చొచ్చిన బ్రిటీష్‌ గ్రాండ్‌ ప్రి టైటిల్‌ను రికార్డు స్థాయిలో ఏడోసారి సొంతం చేసుకున్నాడు. ఆదివారం జరిగిన రేసులో చివరి ల్యాప్‌లో తన కారు టైరు పంక్చర్‌ అయిప్పటికీ.. తిరిగి వేగం పుంజుకున్న ఈ మెర్సీడెజ్‌ రేసర్‌ గంటా 28 నిమిషాల 01.283 సెకన్లలో గమ్యాన్ని చేరుకుని అగ్రస్థానంలో నిలిచాడు.

సుమారు ఆరు సెకన్ల తేడాతో వెర్స్‌టాపెన్‌ (రెడ్‌బుల్‌) రెండో స్థానంలో నిలిచాడు. లీక్లెర్క్‌ (ఫెరారీ) మూడో స్థానం సాధించాడు. ఈ గెలుపుతో 87వ గ్రాండ్‌ ప్రి టైటిల్‌ను ఖాతాలో వేసుకున్న హామిల్టన్‌ దిగ్గజ రేసర్‌ షుమాకర్‌ (91) రికార్డుకు నాలుగు విజయాల దూరంలో నిలిచాడు.

ABOUT THE AUTHOR

...view details