తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఆసియా ఒలింపిక్స్​ క్వాలిఫయర్స్​కు గురుప్రీత్​, సునీల్​ - గురుప్రీత్

జాతీయ ఎంపిక ట్రయల్స్​లో తొమ్మిది మంది రెజ్లర్లను ఎంపిక చేసింది భారత రెజ్లింగ్ సమాఖ్య. ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్, 2021 ఆసియా ఛాంపియన్ ఈవెంట్లను దృష్టిలో ఉంచుకుని ఈ అర్హత పోటీలు జరిగాయి.

Gurpreet Singh, Sunil Kumar among nine wrestlers selected for Asian Olympic qualifiers
జాతీయ ఎంపిక ట్రయల్స్​లో గురుప్రీత్​, సునీల్​

By

Published : Mar 16, 2021, 6:08 PM IST

దిల్లీలోని ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహించిన జాతీయ ఎంపిక ట్రయల్స్​లో గురుప్రీత్ సింగ్ (77 కేజీ), సునీల్ కుమార్ (87 కేజీ) సహా తొమ్మిది మంది రెజ్లర్లు ఎంపికయ్యారు. ఆసియా​ ఒలింపిక్ క్వాలిఫయర్స్​, 2021 ఆసియా ఛాంపియన్​షిప్​ ఈవెంట్ల దృష్ట్యా వీరి ఎంపిక జరిగింది.

గురుప్రీత్, సునీల్, జ్ఞానేంద్ర (60 కేజీ), అష్ (67 కేజీ), రవి (97 కేజీ), నవీన్ (130 కేజీ) గ్రేసో రోమన్​ స్టైల్​లో ఎంపికయ్యారు. సందీప్ సింగ్​ మన్ (74 కేజీ), సత్యవర్త్​ కడియన్ (97 కేజీ), సుమిత్​ (125 కేజీ) ఫ్రీ స్టైల్​ ఈవెంట్​లో సెలెక్ట్​ అయ్యారు. మరి కొన్ని కేటగిరీలకు సంబంధించి ట్రయల్స్​ ఈనెల మూడో వారంలో జరగనున్నాయి.

ట్రయల్స్​కు దూరంగా సుషీల్​ కుమార్..

రెండు సార్లు ఒలింపిక్ విజేత సుషీల్​ కుమార్ ప్రస్తుత ట్రయల్స్​కు దూరంగా ఉన్నాడు. ఈ విషయాన్ని భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్​ఐ) ధ్రువీకరించింది. పూర్తి స్థాయిలో ఫిట్​గా లేనందున సుషీల్​ పాల్గొనడం లేదని వెల్లడించింది.

ఇదీ చదవండి:'పంత్, కిషన్​.. కోహ్లీని చూసి నేర్చుకోండి'

ABOUT THE AUTHOR

...view details