వింటర్ గేమ్స్ కోసం భవిష్యత్తులో గుల్మర్గ్ అంతర్జాతీయ గమ్యస్థానం కానుందని కేంద్ర క్రీడల మంత్రి కిరణ్ రిజుజు అన్నారు. ఖేలో ఇండియా జాతీయ పోటీలను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం వర్చువల్గా ప్రారంభించడానికి ముందు ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
"శీతాకాల క్రీడల నిర్వహణకు సిద్ధంగా ఉన్నాం. సంయుక్తంగా వీటిని జరపడానికి జమ్ముకశ్మీర్ క్రీడల మండలి, క్రీడా మంత్రిత్వ శాఖ ఉత్సాహంగా ఉన్నాయి. వింటర్ గేమ్స్ కోసం క్రీడాకారులు బాగా సన్నద్ధమయ్యారు. గుల్మర్గ్ సహా హిమాలయ ప్రాంతాలకు వీటిని నిర్వహించే శక్తి ఉంది. అందుకు వసతులు కల్పించాల్సిన అవసరం ఉంది. శీతాకాల క్రీడల నిర్వహణకు భవిష్యత్తులో గుల్మర్గ్ అంతర్జాతీయ గమ్యస్థానం కానుంది. అందుకోసం కృషి చేస్తున్నాం."