ఐబా ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో (Boxing World Championships) భారత యువ బాక్సర్ ఆకాశ్ కుమార్ (54 కేజీ) పోరాటం ముగిసింది. బెల్గ్రేడ్లో గురువారం జరిగిన సెమీఫైనల్లో కజికిస్థాన్కు చెందిన మఖ్మూద్ సబీర్‌ఖాన్ చేతిలో 0-5 తేడాతో ఘోర పరాజయం చవిచూశాడు. దీంతో కాంస్య పతకంతో సరిపెట్టుకున్నడు ఆకాశ్ (Akash Kumar Boxer).
బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో ఆకాశ్‌కు కాంస్యం - ఐబా
ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో (Boxing World Championships) అద్భుత పోరాటంతో సెమీస్ వరకు చేరిన భారత యువ బాక్సర్ ఆకాశ్.. పోరాటం ముగిసింది. గురువారం సెమీఫైనల్లో ఓటమితో నిష్క్రమించిన (Akash Kumar Boxer) ఆకాశ్.. భారత్‌కు అరంగేట్రంలోనే పతకం సాధించిపెట్టాడు.
ఆకాశ్ కుమార్
21 ఏళ్ల ఆకాశ్.. ఈ టోర్నమెంట్లో భారత్ తరఫున పతకం సాధించిన ఏడో బాక్సర్. కాంస్యంతో పాటు 25 వేల డాలర్లు (సుమారు రూ.18.6 లక్షలు) ప్రైజ్‌మనీ దక్కించుకున్నాడు.
ఇదీ చూడండి:'బాక్సింగ్'తో పేదరికంపై విజేందర్ పోరాటం