భారత్‌లో అత్యంత ఆదరణ ఉన్న గేమ్ ఏదంటే.. క్రికెట్ అని ఇట్టే చెప్పేస్తారు.. కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆదరణ ఉన్న గేమ్ మరొకటి ఉంది. అదే సాకర్(ఫుట్‌బాల్). ఫుట్‌బాల్‌కు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. సాకర్ అభిమానులకు గత నెల రోజులు పండుగలా సాగింది. ఎందుకంటే ఫిఫా వరల్డ్ కప్ ఆదివారం వరకు కొనసాగింది. డిఫెండింగ్ ఛాంపియన్ ఫ్రాన్స్‌పై 4-2 పెనాల్టీ షూటౌట్‌తో అర్జెంటీనా ఫిఫా వరల్డ్ కప్‌ను గెలుచుకుంది. అయితే గూగుల్ సెర్చ్‌లో ఫిఫా వరల్డ్ కప్ గురించే ఎక్కువగా సెర్చ్ చేశారట.
FIFA వరల్డ్‌కప్ ఫైనల్.. గూగుల్‌లో ఫుల్ ట్రాఫిక్.. 25 ఏళ్లలో ఇదే తొలిసారి.. - ఫిఫా వరల్డ్ కప్ గూగుల్ సెర్చ్
ఉత్కంఠభరితంగా సాగిన ఫిఫా వరల్డ్ కప్ ఆదివారం ముగిసింది. డిఫెండింగ్ ఛాంపియన్ ఫ్రాన్స్‌పై అర్జెంటీనా ఘనవిజయం సాధించింది. అయితే ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్.. గూగుల్ సెర్చ్ 25 ఏళ్లలో అత్యధిక ట్రాఫిక్‌ను నమోదు చేసిందని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ట్వీట్ చేశారు. గొప్ప ఆటల్లో ఫుట్‌బాల్ ఒకటని కొనియాడారు.
అత్యధిక ట్రాఫిక్
ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్.. గూగుల్ సెర్చ్ 25 ఏళ్లలో అత్యధిక ట్రాఫిక్‌ను నమోదు చేసిందని ఆల్ఫాబెట్, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ వెల్లడించారు."#FIFAWorldCup ఫైనల్ సమయంలో సెర్చ్ 25 ఏళ్లలో అత్యధిక ట్రాఫిక్‌ను నమోదు చేసింది, ఇది ప్రపంచం మొత్తం ఒక విషయం గురించి వెతుకుతున్నట్లుగా ఉంది" అని పిచాయ్ ట్వీట్ చేశారు. ఇది గొప్ప ఆటల్లో ఒకటని చెప్పారు. ఇరు జట్లు అద్భుతంగా ఆడాయని కొనియాడారు.
గూగుల్ సెర్చ్‌ను 1998లో సెర్గీ బ్రిన్, లారీ పేజ్ స్థాపించారు. 2022లో 90 శాతం కంటే ఎక్కువ మార్కెట్ వాటాతో గూగుల్ సెర్చ్ ప్రస్తుతం మార్కెట్‌లో ఆధిపత్యం చెలాయిస్తోంది. గూగుల్ సెర్చ్ ఏటా ఎవరి గురించి ఎక్కువ సెర్చ్ చేశారో కూడా వివరాలు వెల్లడిస్తుంది.
ఇది ఫుట్‌బాల్ గొప్పదనం!
"ఒక బిలియన్ మందికి పైగా ప్రజలు తమకు ఆటపై ఉన్న ప్రేమతో ఏకమయ్యారు. ఇది ఫుట్‌బాల్ గొప్పదనం. మనల్ని ఏకం చేసే నిజమైన గ్లోబల్ గేమ్ ఫుట్‌బాల్" అని లెక్స్ ఫ్రిడ్‌మ్యాన్ పోడ్‌క్యాస్ట్ హోస్ట్, శాస్త్రవేత్త లెక్స్ ఫ్రిడ్మా.. పిచాయ్ ట్వీట్‌కు కామెంట్ చేశారు.