తెలంగాణ

telangana

ETV Bharat / sports

Asia Championship: బాక్సర్​ సంజీత్​కు స్వర్ణం

ఆసియా ఛాంపియన్​షిప్​లోని 91 కిలోల విభాగం ఫైనల్​లో భారత్​ బాక్సర్​ సంజీత్​ విజేతగా నిలిచాడు. సోమవారం జరిగిన తుదిపోరులో కజెకిస్థాన్​కు చెందిన వాసిలీ లెవిట్​ను ఓడించి.. స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నాడు.

Gold for Sanjeet; Amit Panghal, Shiva Thapa endure close defeats in Asian Championship final
Asia Championship: బాక్సర్​ సంజీత్​కు స్వర్ణం

By

Published : May 31, 2021, 10:33 PM IST

దుబాయ్​ వేదికగా జరుగుతోన్న ఆసియా బాక్సింగ్​ ఛాంపియన్​షిప్​లోని పురుషుల విభాగంలో భారత్​కు తొలి స్వర్ణం దక్కింది. సోమవారం జరిగిన ఫైనల్లో కజెకిస్థాన్​కు చెందిన వాసిలీ లెవిట్​పై భారత బాక్సర్​ సంజీత్​(91 కిలోలు) 4-1 తేడాతో గెలుపొంది.. పసిడి పతకాన్ని సాధించాడు.

టోర్నీలో అంతకుముందు జరిగిన ఫైనల్స్​లో ఓడిన భారత బాక్సర్లు అమిత్​ పంగాల్​(52 కిలోలు), శివ థాపా (64 కిలోలు) రజతం పతకాన్ని అందుకున్నారు.

ఆసియా బాక్సింగ్​ ఛాంపియన్​షిప్​ ప్రస్తుత ఎడిషన్​లో భారత్​ 15 పతకాలతో మెరుగయ్యింది. 2019లో జరిగిన ఛాంపియన్​షిప్​లో రెండు స్వర్ణాలతో పాటు 13 పతకాలను సాధించింది. ఈ సారి కూడా రెండు గోల్డ్​ మెడల్స్​ను సొంతం చేసుకుంది.

ఇదీ చూడండి:ఆసియా ఛాంపియన్​షిప్​: అమిత్​ పంగాల్​కు రజతం

ABOUT THE AUTHOR

...view details