100 మీటర్లు, 200 మీటర్ల పరుగు పోటీల్లో దాదాపు దశాబ్దంన్నర పాటు తిరుగులేని ఆధిపత్యం చలాయించి.. ఒలింపిక్స్, ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో బోలెడన్ని పతకాలు సాధించిన ఉసేన్ బోల్ట్(Usain Bolt) త్వరలోనే 800 మీటర్ల పరుగులో పోటీ పడబోతున్నాడు. నాలుగేళ్ల కిందటే ట్రాక్‌కు టాటా చెప్పేసిన ఉసేన్.. ఇప్పుడు కొత్తగా 800 మీ. పరుగులో కొత్తగా కెరీర్ వెతుక్కుంటున్నాడేంటి అని ఆశ్చర్యపోకండి.
Usain Bolt: మళ్లీ ట్రాక్‌పైకి ఉసేన్ బోల్ట్! - మరోసారి ట్రాక్‌పైకి బోల్ట్
పరుగుల వీరుడు ఉసేన్ బోల్ట్(Usain Bolt).. మరోసారి రన్నింగ్ ట్రాక్‌పై కనిపించనున్నాడు. అదేదో పోటీలో అనుకుంటే మీరు పొరబడినట్లే. ఓ ప్రచార కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న 800 మీ. పరుగులో పాల్గొననున్నాడు.
ఉసేన్ బోల్ట్, పరుగుల వీరుడు
ఇది కేవలం ఓ ప్రచార కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న రేసే. జులై 13న ఈ పోటీ జరగనుంది. దీని కోసం తాను కూడా ప్రాక్టీస్ చేస్తున్నట్లు బోల్ట్ వెల్లడించాడు. 2017 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో వైఫల్యం తర్వాత పరుగు ఆపేసిన బోల్ట్.. వ్యక్తిగత జీవితాన్ని ఆస్వాదిస్తున్నాడు. మధ్యలో కొన్నాళ్లు సంగీతం మీద దృష్టిపెట్టాడు. ఇటీవలే అతడి భార్య కవలలకు జన్మనిచ్చింది.
ఇదీ చదవండి:బోల్ట్ మెచ్చినోడు.. బోల్ట్‌ను మించినోడు
Last Updated : Jul 7, 2021, 11:54 AM IST