Maradona's Jersy record price: ఫుట్‌బాల్ దిగ్గజం డీగో మారడోనా కన్నుమూసినా అతడి పేరిట ఓ రికార్డు నమోదైంది. 1986 ప్రపంచకప్‌లో అతడు ధరించిన ఓ జెర్సీ వేలంలో రికార్డు స్థాయిలో అమ్ముడుపోయింది. ఇంగ్లాండ్‌తో క్వార్టర్‌ఫైనల్ సందర్భంగా వివాదాస్పద 'హ్యాండ్ ఆఫ్ గాడ్' గోల్ కొట్టిన సమయంలో మారడోనా వేసుకున్న జెర్సీ దాదాపుగా రూ. 70 కోట్లు (9.3 మిలియన్ డాలర్లు) పలికింది.క్రీడా స్మారకాల వేలంలో అత్యధిక ధర పలికిన రికార్డు మారడోనా జెర్సీకే దక్కింది.
ఆ జెర్సీ విలువ రూ.70కోట్లా?
Maradona's Jersy record price: 2020లో కన్నుమూసిన ఫుట్‌బాల్ దిగ్గజం డీగో మారడోనా పేరిట తాజాగా ఓ రికార్డు నమోదైంది. 1986 ప్రపంచకప్‌లో అతడు ధరించిన ఓ జెర్సీ వేలంలో రికార్డు స్థాయిలో అమ్ముడుపోయింది. ఏకంగా రూ.70కోట్లు పెట్టి దీనిని కొనుగోలు చేశారు.
ఆధునిక ఒలింపిక్ మూమెంట్ మేనిఫెస్టో (8.8 మిలియన్ డాలర్లు) పేరిట ఉన్న రికార్డును అది తిరగరాసింది. మారడోనా చొక్కాను కొనుగోలు చేసిన వారి వివరాలను వెల్లడించలేదు. ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌లో మారడోనా రెండు గోల్స్ నమోదు చేశాడు. తొలి గోల్‌ను హెడర్‌గా నిర్ణయించారు. అయితే బంతి డీగో పిడికిలి తాకి గోల్ కావడాన్ని రిఫరీ గుర్తించలేదు. ఆ తర్వాత అసాధారణ రీతిలో బంతిని డ్రిబిల్ చేసుకుంటూ ఇంగ్లాండ్ ఆటగాళ్లందరినీ తప్పించుకుంటూ మారడోనా మరో గోల్ నమోదు చేశాడు. హెడర్‌లో కాస్త దేవుడి హస్తం ఉందంటూ మ్యాచ్ అనంతరం మారడోనా పేర్కొనడం సంచలనం రేపింది. ఫుట్‌బాల్‌లో ఆల్‌టైమ్ గ్రేటెస్ట్ ప్లేయర్‌గా గుర్తింపు పొందిన మారడోనా 2020 నవంబరులో కన్నుమూశారు.
ఇదీ చూడండి: క్రికెటర్ సాహాను బెదిరించిన జర్నలిస్టుపై నిషేధం