2023 యూరోపియెన్ ఫిగర్ స్కేటింగ్ ఛాంపియన్‌షిప్ విజేతగా జార్జియాకు చెందిన అనస్తాసియా గుబనోవా నిలిచింది. అయితే ఈ యువతి మన బాలీవుడ్ పాటలకు స్కేటింగ్ చేస్తూ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. స్లమ్‌డాగ్ మిలియనీర్ మ్యూజిక్‌తో దాదాపు నాలుగు నిమిషాల 30 సెకన్ల పాటు స్కేటింగ్ చేసి అందరిని అబ్బురపరిచింది. అంతే కాకుండా బీ టౌన్‌లోని పలు హిట్ సాంగ్స్‌కు తనదైన స్టైల్లో స్కేటింగ్ చేసి అందరిని ఆశ్చర్యపరిచింది.
'స్లమ్‌డాగ్' మ్యూజిక్కు జార్జియా యువతి స్కేటింగ్.. గోల్డ్ మెడల్ సాధించిందిగా..! - 2023 ఫిగర్ స్కేటింగ్ ఛాంపియన్‌షిప్ అప్డేట్స్
2023 ఫిగర్ స్కేటింగ్ ఛాంపియన్‌షిప్ విజేతగా జార్జియాకు చెందిన అనస్తాసియా గుబనోవా నిలిచింది. అయితే పోటీ సమయంలో ఈ యువతి బాలీవుడ్ పాటలకు స్కేటింగ్ చేసి అందరిని ఆశ్చర్యపరిచింది.
Georgian figure skater Anastasia Gubanova
అనస్తాసియా గుబనోవా బీజింగ్ వింటర్ ఒలింపిక్స్‌లో 11వ స్థానంలో నిలిచింది. ఆ తర్వాత వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో ఆరో స్థానాన్ని సొంతం చేసుకున్న అనస్తాసియా శనివారం జరిగిన యూరో స్కేటింగ్ ఛాంపియన్‌షిప్‌లో 199.1 పాయింట్లు సాధించి గోల్డ్ మెడల్‌ను ముద్దాడింది. ఇక బెల్జియంకు చెందిన లియోనా హెండ్రిక్స్ 193.2 పాయింట్లో రెండో స్థానంలో నిలవగా. మూడో స్థానంలో స్విట్జర్లాండ్‌కు చెందిన కిమ్మి 192.5 పాయింట్లతో కాంస్యం సాధించింది.