తెలంగాణ

telangana

ETV Bharat / sports

మగబిడ్డకు జన్మనిచ్చిన గీతా కుమారి ఫొగాట్ - Geetha Phogat has a baby

భారత రెజ్లర్ గీతా కుమారి ఫొగాట్ మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా పంచుకుంది. వెంటనే గీత, పవన్​కుమార్ దంపతులకు అభినందనలు వెల్లువెత్తాయి.

Geetha Phogat Delivery a baby  Boy
గీతా ఫొగాట్

By

Published : Dec 25, 2019, 8:24 PM IST

భారత రెజ్లర్లు గీతాకుమారి ఫొగాట్, పవన్​కుమార్​ తల్లిదండ్రులయ్యారు. మంగళవారం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ సందర్భంగా బిడ్డతో కలిసి దిగిన ఫొటోను ట్విట్టర్లో అభిమానులతో పంచుకుంది గీత.

"హల్లో బాయ్‌!! ఈ ప్రపంచానికి స్వాగతం. అతనొచ్చేశాడు. మేం ప్రేమలో మునిగిపోయాం. మా చిన్నారికి మీ ప్రేమ, ఆశీర్వాదాలను అందించండి. అతడు మా జీవితాలను పరిపూర్ణం చేశాడు. బిడ్డకు జన్మనివ్వడం కన్నా మెరుగైన అనుభూతి మరింకేం ఉండదు" - గీతా కుమారి ఫొగాట్​, భారత రెజ్లర్​

అనంతరం గీత, పవన్‌కు అభినందనలు వెల్లువెత్తాయి. రెజ్లర్‌ బబిత వారికి శుభాకాంక్షలు తెలియజేసింది. చిన్నారితో తీసుకున్న చిత్రాన్ని ట్వీట్‌ చేసింది.

2010 కామన్వెల్త్‌ క్రీడల్లో స్వర్ణం అందుకున్న భారత తొలి మహిళగా గీత చరిత్ర సృష్టించింది. ఆ తర్వాత కెనడాలో జరిగిన ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో కాంస్యం గెలిచింది. ఆమె కుటుంబంలో అందరూ రెజ్లర్లే కావడం విశేషం.

ఇదీ చదవండి: గంగూలీది ఫ్లాప్ ఐడియా: పాక్ మాజీ కెప్టెన్

ABOUT THE AUTHOR

...view details