తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఒలింపిక్సే లక్ష్యం.. రీఎంట్రీకి సిద్ధమైన గీత ఫొగాట్! - Tokyo Olympics news

కొన్నేళ్ల నుంచి ఆటకు దూరంగా ఉన్న ప్రముఖ మహిళ రెజ్లర్ గీత ఫొగాట్.. త్వరలో రీఎంట్రీ ఇవ్వనుంది. టోక్యో ఒలింపిక్స్​ లక్ష్యంగా ఆమె సాధన చేస్తోంది.

Geeta Phogat readies for comeback as Tokyo Olympic qualifiers loom
ఒలింపిక్సే లక్ష్యం.. రీఎంట్రీకి సిద్ధమైన గీత ఫొగాట్!

By

Published : Mar 21, 2021, 7:15 AM IST

టోక్యో ఒలింపిక్స్ బెర్తు సాధించాలన్న లక్ష్యంతో ఉన్న స్టార్ రెజ్లర్ గీత ఫొగాట్ పునరాగమనం చేయబోతోంది. 2016లో జరిగిన రియో ఒలింపిక్స్​కు అర్హత సాధించడంలో విఫలమైన ఈమె.. తర్వాత మ్యాట్​పై ఎక్కువగా కనబడలేదు. ఆ ఒలింపిక్స్ తర్వాత రెండే టోర్నీలు ఆడి, అదే ఏడాది సహచర రెజ్లర్ పవన్​ను పెళ్లాడింది. 2010లో తల్లయింది.

అయితే గత నాలుగేళ్లలో రెజ్లింగ్​లో నిబంధనలతో సహా ఎన్నో మార్పులొచ్చిన నేపథ్యంలో గీత పునరాగమనం ఆసక్తిని రేపుతోంది. సోమవారం ఆరంభమయ్యే ఆసియా ఒలింపిక్స్ క్వాలిఫయర్స్ ట్రయల్స్ లో 62 కేజీల విభాగంలో సత్తా చాటాలని గీత భావిస్తోంది.

"రెజ్లింగ్ వదిలిపెట్టాలని ఆలోచన ఎప్పుడూ లేదు. ఆరు నెలల నుంచి ఇంట్లో శిక్షణ మొదలు పెట్టా. బిడ్డ పుట్టిన తర్వాత 20-25 కేజీల బరువు తగ్గా" అని గీత చెప్పింది.

భర్త, కుమారుడితో గీత ఫొగాట్

ABOUT THE AUTHOR

...view details