French Open 2023 Mens Final Winner : పారిస్: టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్ (సెర్బియా) కెరీర్‌లో 23వ గ్రాండ్ స్లామ్ గెలిచి రికార్డు సృష్టించాడు. ఆదివారం జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో 7-6, 6-3, 7-5 తేడాతో కాస్పర్ రూడ్ (నార్వే)ను ఓడించి టైటిల్‌ను ముద్దాడాడు. ఈ విజయంతో రఫెల్ నాదల్ (22) పేరిట ఉన్న రికార్డును జకోవిచ్ అధిగమించాడు. ఇప్పటివరకు 33 సార్లు గ్రాండ్‌స్లామ్ ఫైనల్‌కు చేరిన జకోవిచ్.. 23 సార్లు విజేతగా నిలిచాడు. జకోవిచ్ ఇప్పటివరకు 10 ఆస్ట్రేలియన్ ఓపెన్, 3 యూఎస్ ఓపెన్, 3 ఫ్రెంచ్ ఓపెన్, 7 వింబుల్డన్ టైటిళ్లను సొంతం చేసుకున్నాడు.
French Open 2023 : జకోవిచ్ సూపర్ విక్టరీ.. నాదల్ రికార్డు బ్రేక్ - జకోవిచ్ ఫ్రెంచ్ ఓపెన్ 2023 విజేత జకోవిచ్
French Open 2023 Mens Final Winner : టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్ (సెర్బియా) కెరీర్‌లో 23వ గ్రాండ్ స్లామ్ గెలిచి రికార్డు సృష్టించాడు. ఆదివారం జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో కాస్పర్ రూడ్ (నార్వే)ను ఓడించి టైటిల్‌ను ముద్దాడాడు.

నువ్వు సాధించావు జకోవిచ్ : నాదల్
తన రికార్డును బద్ధలు కొట్టిన అతడికి రఫాల్ నాదల్ అభినందనలు తెలిపాడు. ఈ మేరకు ట్విట్టర్వేదికగా పోస్టు పెట్టారు. అందులో " ఈ ఘనత సాధించినందుకు అభినందనలు. కొన్నేళ్ల క్రితం 23 అనేది ఒక సంఖ్య మాత్రమే. ఆ మార్క్ అందుకోవడం అసాధ్యం అనిపించేది. కానీ, నువ్వు ఈ రోజు 23వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించావు. ఈ విజయాన్ని నీ కుటుంబ సభ్యులతో, జట్టుతో ఎంజాయ్ చెయ్" అని నాదల్ రాసుకొచ్చాడు.
French Open Womens Singles Winner : శనివారం జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్‌లో స్వైటెక్ (పోలెండ్) అదరగొట్టింది. మొదటి సెట్‌లో స్వైటెక్ పూర్తి ఆధిపత్యం చెలాయించింది. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా చెలరేగిపోయింది. కానీ, అనూహ్యంగా పుంజుకొన్న ముచోవా రెండో సెట్‌లో పైచేయి సాధించింది. అనంతరం విజయం మూడో సెట్ మీద ఆధారపడడం వల్ల ఇద్దరూ పోటాపోటీగా ఆడారు. హోరాహోరీగా జరిగిన ఈ ఫైనల్లో చివరకు ముచోవా (చెక్ రిపబ్లిక్)ను 6-2, 5-7, 6-4 తేడాతో ఓడించి టైటిల్ పట్టేసింది. దీంతో ఎర్రమట్టి కోర్టులో వరుసగా రెండో సారి, నాలుగేళ్లలో మూడో సారి టైటిల్ సాధించింది. మరోవైపు 2020, 2022, 2023లో స్వైటెక్ ఫ్రెంచ్ ఓపెన్ టైటిళ్లు నెగ్గింది. నిరుడు యూఎస్ ఓపెన్‌లోనూ విజేతగా నిలిచింది. దీంతో నాలుగు సార్లు మేజర్ సింగిల్స్ ఛాంపియన్స్‌గా నిలిచి ప్లేయర్‌గా ఘనత సాధించింది. స్క్వైటెక్ ఇప్పటివరకు 14 టెన్నిస్ వరల్డ్ టెన్నిస్ అసోషియేషన్ (డబ్ల్యూటీఏ) టూర్ లెవెల్ టైటిళ్లు సాధించింది. అమ్మాయిల సింగిల్స్‌లో 2018లో వింబుల్డన్ ఛాంపియన్‌గా కూడా నిలిచింది. డబ్ల్యూటీఏ ర్యాకింగ్స్లో ప్రస్తుతం ప్రపంచ నంబర్ 1 స్థానంలో కొనసాగుతోంది స్క్వైటెక్.