ఈ ఏడాది జరిగిన వింబుల్డన్ 2022లో సెమీస్‌కు ముందే గాయం కారణంగా ఆ టోర్నీ నుంచి తప్పుకున్న స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్.. తన ఆశలన్నీ యూఎస్ ఓపెన్‌పైనే పెట్టుకున్నాడు. కానీ ఇప్పుడతడకి నిరాశే మిగిలింది. ప్రస్తుతం జరుగుతున్న యూఎస్ ఓపెన్‌లో నాలుగో రౌండ్లో అమెరికాకు చెందిన ఫ్రాన్సిస్ టోయాఫే చేతిలో ఘోరంగా ఓటమి పాలయ్యాడు. పురుషుల్ సింగిల్స్ విభాగంలో జరిగిన ఈ మ్యాచ్‌లో నాలుగు సెట్లలో మూడింటిని సొంతం చేసుకుని అద్భుత విజయాన్ని అందుకున్నాడు ఫ్రాన్సిస్.
ఆర్థర్ ఆషే స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఫ్రాన్సీస్.. నాదల్‌ను 6-4. 4-6, 6-4 6-3 తేడాతో ఓడించి విజయాన్ని సాధించాడు. 24 ఏళ్ల అమెరికన్ ప్లేయర్ రఫా పూర్తి ఆధిపత్యం చెలాయించాడు. కాగా, ఈ మ్యాచ్‌లో మొదటి సెట్‌ను కోల్పోయిన నాదల్.. రెండో సెట్‌లో పుంజుకుని అందులో గెలిచాడు. అయితే తర్వాత జరిగిన రెండు సెట్లలోనూ ఓటమి పాలయ్యాడు. ఫలితంగా మ్యాచ్ చేజార్చుకున్నాడు.