ఫార్ములావన్ ఛాంపియన్ లూయీ హామిల్టన్ తనకు కరోనా వైరస్ సోకలేదని స్పష్టం చేశాడు. ఇప్పటికే వారం రోజుల నుంచి స్వీయ నిర్బంధంలో ఉన్నానని చెప్పాడు. ఇటీవల లండన్‌లో ఓ ఛారిటీ కార్యక్రమానికి హాజరయ్యాడు హామిల్టన్. అదే వేడుకకు హాలీవుడ్ నటి ఇడ్రిస్ ఎల్బా, కెనడా ప్రధాని భార్య సోఫీ గ్రిగెర్ ట్రూడో వచ్చారు. వీరిద్దరికీ కరోనా పాజిటివ్ అని ఆ తర్వాత జరిగిన వైద్య పరీక్షల్లో తేలింది. ఫలితంగా ఇతడికీ ఆ వైరస్ సోకిందని వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఈ విషయంపై స్పందించాడు.
" నాలో వైరస్‌కు సంబంధించిన ఒక్క లక్షణమూ కనిపించట్లేదు. అయినా స్వీయ నియంత్రణలో భాగంగా వారం రోజులుగా ఐసోలేషన్‌లో ఉన్నాను. ఆస్ట్రేలియా గ్రాండ్ ప్రీ రద్దయిన తర్వాత ఈనెల 13 నుంచి ఈ ప్రక్రియలో పాల్గొన్నాను"