ఫార్ములా వన్ ట్రాక్‌పై ప్రపంచ ఛాంపియన్ లూయిస్ హామిల్టన్ జోరు కొనసాగుతోంది. ఆదివారం జరిగిన ఎమీలియా రొమాగ్నా గ్రాండ్ ప్రి రేసులో అతను విజేతగా నిలిచాడు. హామిల్డన్కిది 93వ గ్రాండ్ ప్రి టైటిల్.
హామిల్టన్ ఖాతాలో మరో విజయం - hamilton win the race
ఫార్ములా వన్ రేసర్ లూయిస్ హామిల్టన్(ఇంగ్లాండ్).. ఆదివారం జరిగిన ఎమీలియా రొమాగ్నా గ్రాండ్ ప్రి రేసులో విజేతగా నిలిచాడు. ప్రపంచ ఛాంపియన్ హామిల్డన్కిది 93వ గ్రాండ్ ప్రి టైటిల్.

హామిల్డన్
ఇప్పటికే అతను దిగ్గజ రేసర్ షుమాకర్(91) రికార్డును బద్దలు కొట్టాడు. రేసును రెండో స్థానం నుంచి మొదలు పెట్టిన మెర్సిడెజ్ రేసర్ హామిల్టన్ గంటా 28 నిమిషాల 32.430 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకున్నాడు. మెర్సీడెజ్కే చెందిన బొటాస్, రెనాల్డ్ డ్రైవర్ రిసియార్డో వరుసగా రెండు మూడు స్థానాల్లో నిలిచారు.