తెలంగాణ

telangana

ETV Bharat / sports

కరోనా తర్వాత మళ్లీ ట్రాక్​పైకి రయ్​.. రయ్​..

కరోనా సంక్షోభం కారణంగా ప్రపంచవ్యాప్తంగా క్రీడా టోర్నీలన్నీ బంద్​ అయ్యాయి. ఇప్పుడిప్పుడే కొన్ని దేశాలు లాక్​డౌన్​ ఆంక్షలు సడలిస్తుండటం వల్ల మళ్లీ ఆయా కార్యక్రమాలు మొదలవుతున్నాయి. తాజాగా ఫార్ములా వన్​ రేసింగ్​ ఆ జాబితాలో చేసింది. ఇందుకు సంబంధించిన నయా షెడ్యూల్​ను ప్రకటించారు ఫార్ములా వన్​ నిర్వాహకులు.

By

Published : Jun 3, 2020, 11:51 AM IST

Formula 1 season will begin with races in Austria on July 5 and July 12
కరోనా తర్వాత మళ్లీ ట్రాక్​పైకి రయ్​.. రయ్​..

కరోనా తర్వాత ఫార్ములావన్​ రేసులు పునః ప్రారంభానికి రంగం సిద్ధమైంది. ఐరోపా దేశాల్లో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టడం వల్ల.. వాయిదా పడిన రేసులకు కొత్త షెడ్యూల్​ ప్రకటించారు ఎఫ్‌1 నిర్వాహకులు‌. జులై తొలివారంలో ఆస్ట్రియా గ్రాండ్‌ప్రి రేసులతో 2020 సీజన్‌ ఆరంభమవుతుంది. మొత్తం ఎనిమిది రేసులు జరగనున్నాయి.

జులై 5, 12న ఆస్ట్రియా గ్రాండ్‌ప్రి, జూలై 19న హంగేరి గ్రాండ్‌ప్రి రేసులు నిర్వహిస్తారు. అనంతరం ఆగస్టు 2న, ఆగస్టు 9న బ్రిటన్​, ఆగస్టు 16న స్పెయిన్, ఆగస్టు 30న బెల్జియం, సెప్టెంబరు 6న ఇటలీ వేదికగా ఈ రేసులు జరుగుతాయి. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారమైతే.. సీజన్‌లో మొత్తం 22 రేసులు జరగాలి. అయితే కరోనా మహమ్మారి ప్రభావంతో వాటి సంఖ్యను కుదించారు. ఇప్పటికైతే ఎనిమిది రేసుల తేదీలను ఖరారు చేయగా.. వాటిని 15 లేదా 18 రేసులకు పెంచుతామని నిర్వహకులు తెలిపారు. అయితే ఈ మ్యాచ్​లన్నీ అభిమానులు లేకుండానే జరగనున్నాయి.

ఎఫ్​ 1 విడుదల చేసిన తాజా షెడ్యూల్​

వర్చువల్‌ రేసులు ఉండవా..!

కరోనా వైరస్‌ కారణంగా ఫార్ములావన్‌ రేసులు వాయిదా పడిన నేపథ్యంలో అప్పట్లో కీలక నిర్ణయం ప్రకటించింది ఎఫ్​ వన్​. అభిమానుల కోసం డ్రైవర్లు వర్చువల్‌ రియాలిటీ రేసుల్లో పోటీపడతారని చెప్పింది. అభిమానులు ఎఫ్‌-1 రేసులను చూసే అవకాశాన్ని కోల్పోతున్న భావన కలగకుండా జూన్‌ 7 నుంచి ఈ క్రీడలు జరుగుతాయని ప్రకటించింది. అయితే తాజాగా రేసింగ్​ కార్యక్రమాలు పునరుద్ధరణ కావడం వల్ల ఇవి రద్దయ్యే పరిస్థితి కనిపిస్తోంది.

ఇదీ చూడండి: 'ఆల్​టైం గ్రేట్స్​' జాబితాలో హామిల్టన్​కు రెండోస్థానం

ABOUT THE AUTHOR

...view details