రెడ్‌బుల్ ఎఫ్-1 డ్రైవర్ మ్యాక్స్ వెర్‌స్టాపెన్ మొనాకో గ్రాండ్ ప్రి టైటిల్‌ను దక్కించుకుని.. ఈ ఏడాది డ్రైవర్ ఛాంపియన్షిప్ పోటీల్లో మళ్లీ అగ్రస్థానానికి చేరుకున్నాడు. ఆదివారం జరిగిన 78 ల్యాప్‌ల ప్రధాన రేసును గంటా 38నిమిషాల 56సెకన్లలో ముగించి విజేతగా నిలిచాడు. ఈ సీజన్లో వెర్‌స్టాపెన్‌కు ఇది రెండో విజయం.
మొనాకో గ్రాండ్ ప్రి విజేత వెర్‌స్టాపెన్ - Verstappen Formula 1 2021
రెడ్‌బుల్ డ్రైవర్ మ్యాక్స్ వెర్స్టాపెన్ను మొనాకో గ్రాండ్ ప్రి టైటిల్ వరించింది. ఈ రేసులో కార్లోస్ సెయింజ్(ఫెరారీ) రెండో స్థానంలో నిలవగా.. హామిల్టన్(మెర్సిడెస్)ఏడో స్థానంతో సరిపెట్టుకున్నాడు.
![మొనాకో గ్రాండ్ ప్రి విజేత వెర్‌స్టాపెన్ ver](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11873417-498-11873417-1621830290227.jpg)
వెర్‌స్టాపెన్
కార్లోస్ సెయింజ్(ఫెరారీ) రెండో స్థానంలో నిలవగా.. హామిల్టన్(మెర్సిడెస్)ఏడో స్థానంతో సరిపెట్టుకున్నాడు. ల్యాండో నోరిస్(మెక్లారెన్) మూడో స్థానంలో నిలిచాడు. సీజన్లో తదుపరి గ్రాండ్ ప్రి అజర్బైజాన్ వేదికగా జూన్ 6న జరగనుంది.