తెలంగాణ

telangana

ETV Bharat / sports

మూడు నెలల తర్వాత ఇంటికొచ్చిన ఆనంద్​

కరోనా లాక్​డౌన్​ కారణంగా జర్మనీలో ఉండిపోయిన చెస్​ దిగ్గజం విశ్వనాథన్​ ఆనంద్​ ఎట్టకేలకు స్వదేశానికి వచ్చారు. దాదాపు 3 నెలల తర్వాత ఇంటికి రాగా.. ఆయనకి 14 రోజులు హోమ్​ క్వారంటైన్​ సూచించారు అధికారులు.

Viswanathan Anand
మూడు నెలల తర్వాత ఇంటికొచ్చిన విశ్వనాథన్​ ఆనంద్​

By

Published : May 30, 2020, 8:55 PM IST

కరోనా ఆంక్షల నేపథ్యంలో జర్మనీలో చిక్కుకుపోయిన భారత దిగ్గజ చదరంగ​ క్రీడాకారుడు విశ్వనాథన్​ ఆనంద్​ శనివారం స్వదేశంలో అడుగుపెట్టారు. క్షేమంగా బెంగళూరుకు వచ్చినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ప్రస్తుతం పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. ఇంటికి వచ్చిన ఆయనను.. 14 రోజులు స్వీయ నిర్బంధంలో ఉండాలని ​సూచించారు అధికారులు.

విశ్వనాథన్​ ఆనంద్

ఒండస్‌లీగా చెస్‌ లీగ్‌ కోసం జర్మనీ వెళ్లిన ఆనంద్​​.. కరోనా లాక్​డౌన్ ఆంక్షల​ వల్ల భారత్‌కు రాలేకపోయారు. అయితే ప్రస్తుతం విదేశాల్లోని భారతీయులను తీసుకొచ్చేందుకు ప్రభుత్వం 'వందే భారత్​ మిషన్​' పేరుతో ప్రత్యేకంగా విమానాలు నడుపుతోంది. వాటి సాయంతో ఆనంద్​ ఇంటికి వచ్చారు.

జర్మనీలో ఉంటూనే ఆనంద్‌.. హంపి, హరికృష్ణ తదితర భారత క్రీడాకారులతో కలిసి ఆన్‌లైన్‌ చెస్​ టోర్నీ నిర్వహించారు. ఆ మ్యాచ్​ల ద్వారా సేకరించిన విరాళాలను ప్రధానమంత్రి సహాయ నిధికి అందజేశారు.

ఇదీ చూడండి: క్రీడల్లో అత్యున్నత పురస్కారానికి రోహిత్​శర్మ నామినేట్​

ABOUT THE AUTHOR

...view details