ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ఈ వైరస్ మహమ్మారి కారణంగా ఇప్పటికే పలు క్రీడాటోర్నీలు రద్దవగా.. వాటిని పునఃప్రారంభించడానికి సిద్ధమవుతున్నారు నిర్వాహకులు. అయితే ఇందులో పాల్గొనాలంటే వ్యాక్సినేషన్ తప్పనిసరి. అందువల్ల క్రీడాకారులకు టీకా వేయించేందుకు ఇప్పటికే కృషి చేస్తోంది క్రీడామంత్రిత్వ శాఖ. తాజాగా అథ్లెట్లకు వ్యాక్సిన్ విషయంపై కేరళ ప్రభుత్వం, క్రీడాశాఖకు విన్నవించింది ప్రముఖ అథ్లెట్ పీటీ ఉష.
"త్వరలో ప్రారంభంకాబోయే జాతీయ, మిగతా పోటీల్లో పాల్గొనడానికి వీలుగా క్రీడా వ్యక్తులు, కోచ్లు, సహాయ సిబ్బంది, మెడికల్ సిబ్బందికి త్వరగా టీకాలు వేయాలని కేరళ ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నా. క్రీడా విభాగాన్ని అశ్రద్ధ చేయకూడదు."