Samar Banerjee Passes Away:దిగ్గజ ఫుట్‌బాలర్, భారత జట్టు మాజీ కెప్టెన్ సమర్ బెనర్జీ(92) తుదిశ్వాస విడిచారు. వయో సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన కోల్‌కతాలోనే ఎస్ఎస్కేఎమ్ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల పలువురు క్రీడా ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు.
క్రీడా ప్రపంచంలో అందరికీ సుపరిచితులుగా ఉన్న ఆయన.. 1956లో జరిగిన మెల్బోర్న్ ఒలింపిక్స్ లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. అందులో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. అలాగే ప్రముఖ ఫుట్‌బాల్ క్లబ్ 'మోహన్ బగన్'కు ఏడు సంవత్సరాలు ప్రాతినిధ్యం వహించారు.
భారత దిగ్గజ ఫుట్‌బాలర్ కన్నుమూత - సమర్ బెనర్జీ కన్నుమూత
భారత ఫుట్‌బాల్ టీమ్ మాజీ కెప్టెన్ సమర్ బెనర్జీ(92) కన్నుమూశారు. వయోసంబంధిత కారణాలతో ఆయన తుదిశ్వాస విడిచారు.
టీమ్ మాజీ కెప్టెన్ సమర్ బెనర్జీ
ఇవీ చూడండి: క్రికెట్ బంతి తగిలి యువ క్రికెటర్ మృతి