తెలంగాణ

telangana

ETV Bharat / sports

దిగ్గజ అథ్లెట్ మిల్కా సింగ్ కన్నుమూత - Milkha Singh

Milkha Singh
మిల్కా సింగ్

By

Published : Jun 19, 2021, 12:42 AM IST

Updated : Jun 19, 2021, 2:09 AM IST

00:37 June 19

భారత దిగ్గజ అథ్లెట్ మిల్కా సింగ్ కన్నుమూశారు. ఆక్సిజన్​ స్థాయిలు పడిపోవడం వల్ల ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి 11.30కు తుది శ్వాస విడిచారు.

ఆక్సిజన్​ స్థాయిలు ఆందోళనకర స్థాయిలో పడిపోవడం వల్ల మిల్కాను జూన్​ 3న చంఢీగఢ్​లోని పీజీఐఎంఈఆర్​ ఆస్పత్రిలో చేర్చారు. అదివరకే ఆయన కరోనా బారినపడి కోలుకున్నారు. మిల్కా సతీమణి నిర్మల్‌ కౌర్‌ కరోనాతో చికిత్స పొందుతూ గతవారం కన్నుమూశారు.

నిజమైన ప్రేమ..

మిల్కా మరణం గురించి ఆయన కుటుంబ సభ్యులు ప్రకటన చేశారు. "ఆయన ఎంతో పోరాడారు. కానీ దేవుడు తన పని తాను చేశాడు. నిజమైన ప్రేమ వల్లే మా అమ్మ నిర్మల, ఇప్పుడు నాన్న.. 5 రోజుల వ్యవధిలో ఈ లోకాన్ని విడిచివెళ్లారు." అని చెప్పారు.

వైద్యులు తీవ్రంగా శ్రమించినప్పటికీ మిల్కాను కాపాడుకోలేపోయినట్లు పీజీఐఎంఈఆర్​ ఆస్పత్రి విచారం వ్యక్తం చేసింది. ఆయన ఎంతో పోరాడిన అనంతరం తుది శ్వాస విడిచారని ఓ ప్రకటనలో తెలిపింది.

ఇదీ చూడండి:మిల్కా సింగ్​ ఆరోగ్యంపై ప్రధాని మోదీ ఆరా

Last Updated : Jun 19, 2021, 2:09 AM IST

ABOUT THE AUTHOR

...view details