అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ లియోనెల్ మెస్సీ మరో అవార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఫ్రాన్స్ దిగ్గజ ఆటగాడు ఎంబాపె, బెంజెమాతో పోటీ పడి మెన్స్ ప్లేయర్ అవార్డు 2022ను సొంతం చేసుకున్నాడు. సోమవారం రాత్రి పారిస్‌లో నిర్వహించిన బెస్ట్ ఫిఫా(FIFA) ఫుట్‌బాల్ ప్లేయర్ అవార్డ్స్‌లో మెస్సీ ఈ అవార్డును సొంతం అందుకున్నాడు. కాగా, గతేడాది జరిగిన ఫిపా వరల్డ్ కప్ సంగ్రామంలో అర్జెంటినాను మెస్సీ జగజ్జేతగా నిలిపాడు.
Lionel Messi : ఫిఫా బెస్ట్ ప్లేయర్‌గా మెస్సీ.. ఎంబాపెకు మళ్లీ నిరాశే! - ఫిఫా బెస్ట్ ప్లేయర్ అవార్డ్ 2022 బెంజెమా
అర్జెంటినా సాకర్ స్టార్ లియోనెల్ మెస్సీ మరో ఘనత సాధించాడు. ఫిఫా మెన్స్ బెస్ట్ ప్లేయర్ అవార్డును 2022 ఏడాదికి గానూ అందుకున్నాడు. ఇక, మహిళల విభాగంలో స్పెయిన్ క్రీడాకారిణి అలెక్సియా పుటెల్లాస్ వరుసగా రెండో ఏడాది అత్యుత్తమ ప్లేయర్‌గా అవార్డును సొంతం చేసుకుంది.
అయితే, ఈ అవార్డుకోసం మెస్సీతో పాటు ఫ్రాన్స్ సాకర్ వీరులు ఎంబాపే, కరీమ్ బెంజెమా పోటీ పడ్డారు. కానీ తన ప్రత్యర్థి చేతిలో ఈసారి కూడా ఎంబాపె ఓడిపోయాడు. ఈ లిస్టులో లయోనల్ మెస్సీ 52 పాయింట్లతో ప్రథమ స్థానంలో ఉన్నాడు. ఇక, ఎంబాపె 44 పాయింట్లు, జెంజెమా 34 పాయింట్లతో తర్వాతి స్థానాల్లో నిలిచారు.
ఇక, మహిళల విభాగంలో స్పెయిన్ క్రీడాకారిణి అలెక్సియా పుటెల్లాస్ వరుసగా రెండో ఏడాది అత్యుత్తమ క్రీడాకారిణిగా అవార్డును సొంతం చేసుకొంది. మెస్సీ.. మెన్స్ బెస్ట్ ప్లేయర్ అవార్డును వరుసగా ఏడోసారి సొంతం చేసుకోవడం విశేషం.