కామన్వెల్త్ గేమ్స్-2022లో వ్యక్తిగత విభాగాల్లో పసిడి పతకాలను ఒడిసి పట్టుకునేందుకు పీవీ సింధు సహా ఇతర భారత స్టార్ షట్లర్లు ఊవ్విళ్లూరుతున్నారు. 2018లో ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్‌లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో రెండు స్వర్ణాల సహా ఆరు పతకాలను గెలిచిన భారత షట్లర్లు.. ఈ సారి అంతకు మించిన ఆట తీరుతో అదరగొట్టేందుకు సమాయత్తమవుతున్నారు. మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్‌ను నిలబెట్టుకోవడంతో పాటు స్థిరమైన ప్రదర్శన కనబర్చాలనే వ్యూహంతో ముందుకెళ్లాలని ఆటగాళ్లు భావిస్తున్నారు.
సింగిల్స్‌తోపాటు డబుల్స్‌లో మెరుగైన ప్రదర్శన ఇచ్చేందుకు సమాయత్తమవుతున్నారు పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్, లక్ష్య సేన్. సింగపూర్ ఓపెన్‌లో స్వర్ణం గెలిచిన సింధుతో పాటు ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో సత్తా చాటిన కిదాంబి శ్రీకాంత్, లక్ష్య సేన్.. పసిడి పతకాన్ని సాధించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. పీవీ సింధు ఇప్పటి వరకు రెండు కామన్వెల్త్ గెమ్స్‌లో పాల్గొన్నది. 2014లో కాంస్యం, గెలవగా.. 2018లో సిల్వర్ గెలించింది. ఈ సారి ఎలాగైనా పసిడి గెలవాలని చూస్తోంది.
చిరాగ్ శెట్టి, సాత్విక్‌సాయిరాజ్ రాంకిరెడ్డి ద్వయం 2018 కామన్వెల్త్ క్రీడల్లో రజతం గెలుచుకున్నారు. అయితే ఈ సారి అంతుకు మించిన ఆటతో పసిడిని గెలవాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఈ సారి వ్యక్తిగత పతకాల కంటే.. మిక్స్‌డ్ డబుల్స్ ఈవెంట్స్ పైనే భారత్ టీమ్ దృష్టి సారించినట్లు కనిపిస్తోంది.
2014 వరకు కామన్వెల్త్ గేమ్స్‌లో మలేషియా, ఇంగ్లాండ్ ఆధిపత్యమే ఉండేంది. అయితే 2018లో భారత బ్యాడ్మింటన్ టీమ్ చరిత్ర సృష్టించింది. రెండు స్వర్ణాలు సాధించింది మలేషియాను వెనక్కి నెట్టింది.