అమెరికా బాక్సింగ్ దిగ్గజం ఫ్లాయిడ్ మేవెదర్‌కు ఫుట్‌బాల్ అంటే ఆసక్తి ఎక్కవ. ముఖ్యంగా ప్రీమియర్ లీగ్ క్లబ్ న్యూకాసిల్ యునైటెడ్ జట్టుకు వీరాభిమాని. తరచూ ఆ క్లబ్ మ్యాచ్‌లకు మేవెదర్ హాజరవుతుంటాడు. అయితే న్యూకాసిల్‌ను అమ్మడానికి ఆ క్లబ్ యజమాని మైక్ కాష్లే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం రాగా... ఆ జట్టులో అత్యధిక వాటాను కొనడానికి మేవెదర్ ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం. దాదాపు ఏడు వేల కోట్ల రూపాయలతో ఈ డీల్ కుదుర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఆ ప్రీమియర్ లీగ్‌లో జట్టు కోసం రూ.7 వేల కోట్లతో మేవెదర్! - Floyd Mayweather eye on Newcastle United
ఫ్లాయిడ్ మేవెదర్.. ప్రపంచంలోనే అత్యంత సంపన్న బాక్సర్. ఓటమి అంటే తెలియని యోధుడు. తన కెరీర్ గ్రాఫ్‌లో 50 ఫైట్స్‌లో పాల్గొని మొత్తం 50 గెలిచిన బాక్సర్. అలాంటి ఆటగాడికి ఫుట్‌బాల్ అన్నా అంతే ఇష్టం. అందుకే తాజాగా భారీ ధరకు ఓ సాకర్ జట్టును కొనేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.
![ఆ ప్రీమియర్ లీగ్‌లో జట్టు కోసం రూ.7 వేల కోట్లతో మేవెదర్! Floyd Mayweather soccer team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6372696-621-6372696-1583934257534.jpg)
యూఎఫ్‌సీ(అల్టిమేట్ ఫైటింగ్ ఛాంపియన్‌షిప్)లో రెండుస్లారు టైటిల్స్ సాధించిన మిక్స్‌డ్ మార్షల్ ఆర్టిస్ట్.. కోనర్ మెక్‌గ్రెగర్‌తో గతంలో ఓ బౌట్లో తలపడ్డాడు మేవెదర్. దీని ప్రైజ్‌మనీ దాదాపు రూ.6వేల 4వందల కోట్లు కావడం అప్పట్లో పెద్ద సంచలనం సృష్టించింది. ఇందులోనూ గెలిచిన ఈ స్టార బాక్సర్.. గతేడాది ఆటకు వీడ్కోలు పలికాడు. జపాన్ వేదికగా చివరి ఎగ్జిబిషన్ మ్యాచ్‌లో 20 ఏళ్ల కిక్ బాక్సర్ టెన్షిన్పై సునాయాస విజయం సాధించాడు. ఈ పోరు కేవలం రెండే నిమిషాల్లో ముగియడం విశేషం. కెరీర్లో మొత్తం 50 విజయాలతో పాటు 26 ప్రపంచ టైటిళ్లను నెగ్గాడు ఫ్లాయిడ్ మేవెదర్.