టోక్యో ఒలింపిక్స్‌లో పతకం సాధించడంపైనే తన లక్ష్యమని అంటోంది వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను. 2016 ఒలింపిక్స్ తర్వాత మెరుగైన ఫిట్నెస్తో టోర్నీల్లో సత్తా చాటుతున్న మీరాబాయి.. టోక్యో ఒలింపిక్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.
'ఒలింపిక్స్‌లో పతకం సాధించడమే నా లక్ష్యం!' - మీరాబాయి చాను వార్తలు
రాబోయే టోక్యో ఒలింపిక్స్‌లో భారతదేశానికి కచ్చితంగా పతకం సాధిస్తాననే ఆత్మవిశ్వాసంతో ఉన్నానని చెబుతోంది వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను. అందుకోసం తగిన శిక్షణ పొంది సిద్ధంగా ఉన్నానని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.
మీరాబాయి చాను
"టోక్యోలో భారతదేశానికి నేను పతకం తీసుకొస్తానని భావిస్తున్నా. అందుకు చైనా సహా ఇతర దేశాల క్రీడాకారులతో పోటీపడేందుకు సిద్ధంగా ఉన్నా. రియో నుంచి ఇప్పటివరకు అనేక టోర్నీల్లో ఆడుతూ పరిపూర్ణంగా మారానని భావిస్తున్నా. ముఖ్యంగా క్లీన్, జెర్క్లలో తగినంత శిక్షణ పొందడం ద్వారా మరింత ఆత్మవిశ్వాసంతో ఉన్నాను" అని మీరాబాయి చాను వెల్లడించింది.
ఇదీ చూడండి..ఐపీఎల్ బయోబబుల్ సురక్షితం: జంపా
Last Updated : Apr 30, 2021, 12:22 PM IST