ETV Bharat Telangana

తెలంగాణ

telangana

ETV Bharat / sports

'ఫిట్​నెస్​తో శారీరక, మానసిక సమస్యలకు చెక్​' - ఖేలో ఇండియా స్టేట్​ సెంటర్​ ఆఫ్ ఎక్స్​లెన్స్

ప్రతి ఒక్కరి శారీరక, మానసిక సమస్యలకు పరిష్కారం ఫిట్​నెస్​ మాత్రమేనని కేంద్ర క్రీడా శాఖ మంత్రి కిరణ్​ రిజిజు అన్నారు. శ్రీనగర్​లోని స్పోర్ట్స్​ కౌన్సిల్​ వాటర్​ స్పోర్ట్స్​ అకాడమీలో 'ఖేలో ఇండియా స్టేట్​ సెంటర్​ ఆఫ్ ఎక్స్​లెన్స్'​ను ఆయన ప్రారంభించారు.

kiran rijiju, union sports minister
కిరణ్​ రిజిజు, కేంద్ర క్రీడా శాఖ మంత్రి, ఖేలో ఇండియా స్టేట్​ సెంటర్ ఆఫ్ ఎక్స్​లెన్స్​
author img

By

Published : Apr 12, 2021, 11:54 AM IST

ఫిట్​నెస్​ ద్వారా ప్రతి ఒక్కరి మానసిక, శారీరక సమస్యలు దూరమవుతాయని తెలిపారు కేంద్ర క్రీడా శాఖ మంత్రి కిరణ్​ రిజిజు. జమ్మూ కశ్మీర్​ శ్రీనగర్​లోని స్పోర్ట్స్​ కౌన్సిల్​ వాటర్​ స్పోర్ట్స్​ అకాడమీలో.. 'ఖేలో ఇండియా స్టేట్​ సెంటర్​ ఆఫ్ ఎక్స్​లెన్స్'​ను మంత్రి ప్రారంభించారు. శరీరాన్ని ఫిట్​గా ఉంచుకుంటే గొప్ప అనుభూతిగా ఉంటుందని పేర్కొన్నారు.

"ఫిట్​ ఇండియా ఉద్యమంలో భాగంగా శ్రీనగర్​లోని 5,400 అడుగుల ఎత్తున్న కొండపైకి పరుగు ప్రారంభించాను. ఎక్కడైనా, ఎప్పుడైనా.. శరీరాన్ని ఫిట్​గా ఉంచుకుంటే గొప్ప అనుభూతిని పొందవచ్చు! ప్రతి ఒక్కరి మానసిక, శారీరక సమస్యలకు ఫిట్​నెస్​ మాత్రమే పరిష్కారం. రోజూ అరగంట ఫిట్​నెస్​ కోసం కేటాయిస్తే మేలు" అని మంత్రి ట్వీట్​ చేశారు.

ఇదీ చదవండి:మనీష్​ వల్లే సన్​రైజర్స్​ ఓడిపోయింది!: సెహ్వాగ్​

శ్రీనగర్​ దాల్​ సరస్సు సమీపంలోని నెహ్రూ పార్క్​లో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు జమ్ముకశ్మీర్​ లెఫ్టినెంట్ గవర్నర్​(ఎల్జీ) మనోజ్ సిన్హా, ఎల్జీ సలహాదారు ఫరూక్ ఖాన్, జమ్ముకశ్మీర్​ యూత్​ సర్వీసెస్​ కార్యదర్శి అలోక్​ కుమార్ పాల్గొన్నారు. క్రీడా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో.. అత్యాధునిక వాటర్​ స్పోర్ట్స్​ సదుపాయాల్ని కేటాయిస్తామని ఈ ఏడాది ఆరంభంలో మంత్రి ప్రకటించారు. ప్రస్తుతం అందుకు సంబంధించి నిధులు కూడా కేటాయించారు.

ఈ కొత్త ఖేలో ఇండియా సెంటర్​ను ప్రారంభించడం ఆనందంగా ఉందని మంత్రి పేర్కొన్నారు. జమ్ముకశ్మీర్​కు సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీకి చాలా ఆలోచనలు ఉన్నాయని తెలిపారు. యువ క్రీడాకారులకు ఇది శుభపరిణామమని అభిప్రాయపడ్డారు.

ఇదీ చదవండి:'విలయమ్సన్​కు ఇంకా సమయం పడుతుంది'

ABOUT THE AUTHOR

...view details