సినిమా అంటే కొన్ని యాక్షన్స్ సీన్స్.. రొమాంటిక్ సన్నివేశాలతో కలగలపిన ఎమోషన్స్‌తో మరెన్నో ట్విస్ట్‌లు చూస్తుంటాం! అలాంటి సినిమాను తలపించే కొన్ని పరిస్థితులు ఓ వ్యక్తి జీవితంలో ఎదురయ్యాయి. భారత ఆర్మీలో పనిచేసిన సుబేదార్.. పారాలింపిక్స్‌లో భారత్‌కు తొలి స్వర్ణ పతకాన్ని సాధించిపెట్టిన క్రీడాకారుడు. ఆయనే మురళీకాంత్ పెట్కార్. ఈయన జీవతంలో ఎదురైన పరిణామాలు సినిమాల్లో స్క్రీన్‌ప్లేను తలపిస్తుంది. మురళీకాంత్ జీవితంలోని ట్విస్ట్‌లు.. దర్శకుడు పూరీ జగన్నాథ్నూ విస్తుపోయేలా చేయడం ఖాయం! ఇంతకీ ఈ మురళీకాంత్ పెట్కార్ ఎవరు? అతడి జీవితంలో ఎదురైన క్లిష్ట పరిస్థితులేంటి? ఆర్మీలో పనిచేసిన మురళీకాంత్.. పారా-అథ్లెట్‌గా ఎలా మారాడో తెలుసుకుందాం.
భారత్‌కు తొలి స్వర్ణం
ఇటీవల కాలంలో అథ్లెట్ల జీవితంలో ఇంతటి ట్విస్ట్‌లు ఎక్కడా జరిగి ఉండవు. మురళీకాంత్ పెట్కార్ అనే అథ్లెట్.. పారాలింపిక్స్‌లో భారత్‌కు తొలి స్వర్ణాన్ని సాధించిపెట్టాడు. 1972లో జరిగిన హైడెల్బర్గ్ గేమ్స్‌లో 50మీ. ఫ్రీస్టైల్ స్విమ్మింగ్‌లో నెగ్గి ప్రపంచ రికార్డును సృష్టించాడు. అసలు ఈ మురళీకాంత్ ఎవరు? అతడి జీవితంలో ఎదురైన ట్విస్ట్‌ల గురించి తెలుసుకుందాం.
మురళీకాంత్ పెట్కార్.. భారత ఆర్మీలో సుబేదార్‌గా పనిచేశాడు. 1965లో జరిగిన భారత్-పాక్ యుద్ధంలో ఆయనకు 9 తూటాలు తగిలాయి. వాటిలో ఒక బుల్లెట్ ఇప్పటికి అతడి వెన్నెముకలోనే ఉంది. ఈ ఘటన తర్వాత మురళీకాంత్ పక్షవాతానికి గురయ్యాడు. అలా దాదాపుగా రెండేళ్ల తర్వాత తన జ్ఞాపకశక్తినీ కోల్పోయాడు. కానీ, ఈ సంఘటన అతడిలోని ధైర్వవంతుడిని ఆపలేకపోయింది.