ఖతార్ వేదికగా జరుగుతున్న ఫిఫా ప్రపంచ కప్-2022లో అర్జెంటీనా ఫైనల్‌లోకి దూసుకెళ్లింది. మెస్సీ మాయాజాలంతో సెమీఫైనల్‌లో క్రొయేషియాపై అద్భుత విజయం సాధించి ఫైనల్‌కు అర్హత సాధించింది. 3-0 గోల్స్ తేడాతో క్రొయేషియాను మట్టికరిపించింది. ఈ క్రమంలో 2014 తర్వాత మరోసారి ఫైనల్‌లోకి అడుగుపెట్టింది.
Fifa worldcup: మెస్సీ మ్యాజిక్.. ఫైనల్‌కు అర్జెంటీనా - ఫైనల్‌కు అర్జెంటీనా మెస్సీ
మెస్సీ మ్యాజిక్‌తో ఫిఫా ప్రపంచ కప్-2022లో ఫైనల్లో అడుగుపెట్టింది అర్జెంజీనా. 3-0 గోల్స్ తేడాతో క్రొయేషియాను ఓడించింది.
మెస్సీ మ్యాజిక్.. ఫైనల్‌కు అర్జెంటీనా
ఈ మ్యాచ్‌లో తొలి అర్ధభాగంలో అర్జెంటీనా రెండు గోల్స్ చేసింది. మెస్సీ పెనాల్టీ కిక్ ద్వారా (34.14వ నిమిషంలో) ఒక గోల్ చేశాడు. ఆ తర్వాత అల్వరెజ్ రెండు గోల్స్(38.51వ నిమిషంలో) గోల్ చేశాడు. రెండో అర్ధభాగంలో అల్వరెజ్ (69వ నిమిషాల్లో) మరో గోల్ చేశాడు. దీంతో 3-0 గోల్స్ తేడాతో క్రొయేషియాపై విజయం సాధించింది అర్జెంటీనా.
ఇదీ చూడండి: రంజీల్లోకి అడుగుపెట్టిన సచిన్ తనయుడు అర్జున్ తెందూల్కర్..