తెలంగాణ

telangana

ETV Bharat / sports

అఖిల భారత ఫుట్​బాల్​ సమాఖ్యను సస్పెండ్​ చేసిన ఫిఫా - FIFA on undue influence from third parties in India

ఆల్‌ఇండియా ఫుట్‌బాట్‌ ఫెడరేషన్​పై(ఏఐఎఫ్‌ఎఫ్‌) ఆ క్రీడ అత్యున్నత సంస్థ ఫిఫా చర్యలు చేపట్టింది. ఏఐఎఫ్‌ఎఫ్‌ను తక్షణమే సస్పెండ్‌ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయాన్ని ఫిఫా కౌన్సిల్‌ ఏకగ్రీవంగా ఆమోదించింది. దీంతో ఈ ఏడాది అక్టోబర్‌ 11వ తేదీ నుంచి 30 వరకు భారత్‌లో జరగాల్సిన అండర్​-17 మహిళల ప్రపంచ కప్ 2022 టోర్నీపై అనిశ్చితి నెలకొంది.

.
.

By

Published : Aug 16, 2022, 9:37 AM IST

Updated : Oct 29, 2022, 3:53 PM IST

ఆల్‌ ఇండియా ఫుట్‌బాల్‌ ఫెడరేషన్‌ ఏఐఎఫ్ఎఫ్​ను ఫిఫా సస్పెండ్​ చేసింది. ధర్డ్​ పార్టీల నుంచి అనవసరమైన ప్రభావం ఉన్న కారణంగా... ఫిఫా కౌన్సిల్​ బ్యూరో ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని తెలుపుతూ ఓ ప్రకటనను విడుదల చేసింది. "ఫిఫా చట్టాలను తీవ్రంగా ఉల్లంఘించిండం సహా థర్డ్ పార్టీల జోక్యం ఉన్నందున్న ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్‌ను తక్షణమే సస్పెండ్ చేయాలని ఫిఫా కౌన్సిల్ బ్యూరో ఏకగ్రీవంగా నిర్ణయించింది" అని ఫిఫా పేర్కొంది.

సస్పెన్షన్‌ కారణంగా ఈ ఏడాది అక్టోబర్‌ 11వ తేదీ నుంచి 30 వరకు భారత్‌లో జరగాల్సిన అండర్​-17 మహిళల ప్రపంచ కప్ 2022 టోర్నీపై అనిశ్చితి నెలకొంది. భారత్‌ నుంచి టోర్నీని మరో దేశానికి తరలించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, భవిష్యత్తులో ఏఐఎఫ్‌ఎఫ్‌ ఎగ్జిక్యూటీవ్‌ కమిటీ అధికారాలను చేపట్టేందుకు అడ్మిన్‌స్ట్రేటర్స్‌ కమిటీ ఏర్పాటు చేయాలన్న ఆదేశాలను ఉపసంహరించుకొన్నాకే.. ఈ సస్పెన్షన్‌ ఎత్తివేస్తామని ఫిఫా పేర్కొంది. తాము భారత యువజన సర్వీసులు, క్రీడా శాఖతో సంప్రదింపులు జరుపుతుంటామని పేర్కొంది. సానుకూల ఫలితాలు వెలువడవచ్చని ఆశాభావం వ్యక్తం చేసింది.

మరోవైపు భారత ఫుట్​బాలర్లంతా ప్రపంచ ఫుట్‌బాల్‌ సమాఖ్య (ఫిఫా) హెచ్చరికల్ని పట్టించుకోకుండా ఆటపైనే దృష్టి పెట్టాలని స్టార్‌ స్ట్రయికర్‌ సునీల్‌ ఛెత్రి సూచించాడు. ఈ విషయంపై ఆటగాళ్లు అతిగా ఆలోచించాల్సిన అవసరం లేదని చెప్పాడు.

ఇదీ చూడండి:చెన్నైతో జడేజా ఇన్నింగ్స్‌ ముగిసినట్లే

Last Updated : Oct 29, 2022, 3:53 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details