తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఫిడే చెస్ టోర్నీ ఛాంపియన్‌గా కోనేరు హంపి - koneru hampy

భారత గ్రాండ్​ మాస్టర్, తెలుగు తేజం​ కోనేరు హంపి మరో ప్రతిష్టాత్మక టోర్నీలో విజేతగా నిలిచింది. స్కోల్కోవో వేదికగా జరిగిన 'ఫిడే ఉమెన్స్​ గ్రాండ్​ ప్రి​​' ఫైనల్​లో గెలిచి స్వర్ణం దక్కించుకుందీ చదరంగ క్రీడాకారిణి.

ఫిడే చెస్ టోర్నీ ఛాంపియన్‌గా కోనేరు హంపి

By

Published : Sep 22, 2019, 8:52 PM IST

Updated : Oct 1, 2019, 3:20 PM IST

'ఫిడే ఉమెన్స్​ గ్రాండ్​ ప్రి​'లో స్వర్ణం​ గెలిచింది భారత చదరంగ క్రీడాకారిణి కోనేరు హంపి. స్కోల్కోవో వేదికగా ఆదివారం జరిగిన టోర్నీ ఫైనల్లో ప్రపంచ ఛాంపియన్​ జు వెంజున్​(చైనా)పై గెలిచింది. 8 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి స్వర్ణం కైవసం చేసుకుంది హంపి.

పెళ్లి తర్వాత మళ్లీ...
1987 మార్చి 31న ఆంధ్రప్రదేశ్​లోని గుడివాడలో పుట్టిన కోనేరు హంపి... భారత నుంచి అత్యుత్తమ చెస్​ క్రీడాకారిణిగా పేరు సంపాదించింది. 15 ఏళ్లకే గ్రాండ్​ మాస్టర్​గా హోదా సాధించింది. పిన్నవయస్సులోనే మహిళా గ్రాండ్​ మాస్టర్​గా చరిత్ర సృష్టించింది.

2007లో ఈఎల్​వో రేటింగ్​లో 2600 పాయింట్లకు పైగా సంపాదించి... జుడిట్​ పోల్గర్ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో మహిళగా రికార్డు సృష్టించింది. 2014లో పెళ్లి తర్వాత కొన్నేళ్లు ఆటకు విరామం ప్రకటించింది. మళ్లీ రీఎంట్రీలో గ్రాండ్​ ప్రి​ స్వర్ణాన్ని ఖాతాలో వేసుకుంది హంపి. ఇందులో విజేతగా నిలవడం వల్ల 160 పాయింట్లు సహా 15 వేల యూరోల(రూ.11 లక్షల 76వేలు) ప్రైజ్​మనీ గెలుచుకుంది.

Last Updated : Oct 1, 2019, 3:20 PM IST

ABOUT THE AUTHOR

...view details