రియో ఒలింపిక్స్ పతక విజేత సాక్షి మాలిక్ యూడబ్ల్యూడబ్ల్యూ ర్యాంకింగ్ సిరీస్‌లో అదరగొట్టింది. కజకస్థాన్లోని అల్మటీ వేదికగా జరిగిన ఈ టోర్నీలో బంగారు పతకాన్ని సాధించింది. మహిళల 62 కేజీ కేటగిరీలో కజకస్థాన్కు చెందిన ఇరినా కుజ్నెట్సోవాపై 7-4 తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది. ఈ విజయంతో గత కొంతకాలంగా తడబడుతున్న సాక్షి తిరిగి ఫామ్‌లోకి వచ్చింది. దాదాపు ఐదేళ్ల తర్వాత సాక్షిని గోల్డ్ మెడల్ వరించింది. చివరసారిగా 2017లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణాన్ని కైవసం చేసుకుంది.
రెజ్లింగ్‌లో భారత్‌కు మూడు స్వర్ణాలు.. ఐదేళ్ల తర్వాత సాక్షికి మళ్లీ
ఒలింపిక్స్ పతక విజేత,స్టార్ రెజ్లర్ సాక్షి మాలిక్ మరోసారి స్వర్ణం సాధించింది. దాదాపు ఐదేళ్ల తర్వాత ఆమెను మళ్లీ గోల్డ్ మెడల్ వరించింది. సాక్షితో పాటు శుక్రవారం మరో ఇద్దరు రెజ్లర్లు స్వర్ణాలు సాధించారు.
రెజ్లింగ్‌లో భారత్‌కు మరో రెండు స్వర్ణాలు వచ్చాయి. 57 కిలోల కేటగిరీలో మాన్సి కజకస్థాన్కు చెందిన ఎమ్మా టిస్సీనాపై 3-0తో విజయం సాధించగా.. 68 కేజీల కేటగిరీలో దివ్య స్వర్ణం దక్కించుకుంది. మంగోలియాకు చెందిన దెల్గెర్మా ఎన్ఖసయిఖాన్, కజకస్థాన్కు చెందిన అల్బినాలపై గెలిచింది. కానీ ఫైనల్ బౌట్లో మంగోలియాకు చెందిన బొలోర్టుంగలాగ్ చేతిలో 10-14 తేడాతో ఓడిపోయింది. కానీ మొత్తంగా దివ్య ఖాతాలో ఎక్కువ విజయాలు ఉండటం వల్ల ఆమెను విజేతగా ప్రకటించారు. అంతకుముందు గురువారం జరిగిన మ్యాచ్‌లో రెజ్లర్ నీరజ్ కాంస్యం గెలుచుకున్నాడు. దీంతో మొత్తంగా భారత్‌కు ఇప్పటివరకు నాలుగు పతకాలు దక్కాయి.