ఖతార్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్‌లో స్టేడియాల వద్ద మద్యం అమ్మడాన్ని నిషేధించారు. అయితే మైదానానికి కొంత దూరంలో బయట అమ్ముకునేందుకు వీలు కల్పించారు. దీనిని ఆసరాగా తీసుకున్న అభిమానులు తమ సొంత తెలివి తేటలను ఉపయోగించి స్టేడియంలోకి మద్యాన్ని తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
సాధారణంగానే ఫుట్‌బాల్ మ్యాచ్ అంటే కాస్త ఉద్రిక్తత ఉంటుంది. ఎప్పుడు ఏ జట్టు గెలుస్తుందనే కుతూహలంతో ఫ్యాన్స్ అత్యుత్సాహం ప్రదర్శిస్తుంటారు. అదే సమయంలో కాస్త ఎక్కువగానే మద్యాన్ని సేవిస్తుంటారు. అందుకే ఈ సారి ప్రపంచకప్‌లో మైదానానికి మద్యం తెచ్చుకునే విధానాన్ని, అలాగే ఆ చుట్టూ అమ్మడాన్ని నిషేధించారు. అయితే కొందరు దొంగచాటుగా పోలీసులు, సెక్యూరిటీ గార్డుల కళ్లుగప్పి మద్యం స్టేడియం లోపలికి తీసుకురావాలని చూసి అడ్డంగా దొరికిపోతున్నారు. తాజాగా ఓ అభిమాని కూడా అతి తెలివి ప్రదర్శించాడు. తన బైనాక్యులర్స్‌లో బీర్‌ను తీసుకెళ్లి అందరిని షాక్‌కు గురి చేశాడు. చెకింగ్ సమయంలో సెక్యూర్టీ గార్డ్ ఆ బైనాక్యులర్స్ లెన్స్ తీశాడు.