తెలంగాణ

telangana

ETV Bharat / sports

నా బయోపిక్​లో ఆమిర్ నటించాలి: విశ్వనాథన్ ఆనంద్

ఇటీవల 'మైండ్ మాస్టర్' పేరుతో పుస్తకాన్ని విడుదల చేశాడు భారత చెస్ క్రీడాకారుడు విశ్వనాథన్ ఆనంద్. ఈ సందర్భంగా ఆనంద్​తో 'ఈటీవీ భారత్' ప్రత్యేక ముఖాముఖి నిర్వహించింది.

Exclusive | Viswanathan Anand opens up about his retirement plan
విశ్వనాథన్ ఆనంద్

By

Published : Dec 16, 2019, 11:32 AM IST

Updated : Dec 16, 2019, 11:52 AM IST

నా బయోపిక్​లో ఆమిర్ నటించాలి: విశ్వనాథన్ ఆనంద్

అతని మెదడుకు పదునెక్కువ.. ఆలోచనలకు వేగం ఎక్కువ. వ్యూహాలకు ప్రత్యర్థులు చేతులెత్తేస్తారు.. ఐదు సార్లు ప్రపంచ ఛాంపియన్​గా అవతరించి.. చదరంగం క్రీడలో అద్భుత విజయాలు అందుకున్న క్రీడాకారుడు విశ్వనాథన్ ఆనంద్. ఇటీవల 'మైండ్ మాస్టర్' పేరుతో పుస్తకాన్ని విడుదల చేసిన భారత తొలి గ్రాండ్​ మాస్టర్​తో 'ఈటీవీ భారత్' ముఖాముఖి...

ప్ర. 50వ పడిలోకి అడుగుపెట్టారు ఈ ప్రయాణం ఎలా అనిపించింది..?

జ.ఈ ప్రయాణం అద్భుతంగా సాగింది. ఇది ఒక మైలురాయి.. కొన్ని నెలలుగా నా క్లాస్​మెట్​లు ఒక్కొక్కరితో ఈ వేడుకను జరుపుకుంటున్నా. ఇటీవల 50వ పడిలోకి అడుగుపెట్టిన సందర్భంగా నా పుస్తకాన్ని అభిమానులు ముందుకు తీసుకురావడం చాలా ఆనందంగా ఉంది.

ప్ర. పుస్తకంలో ఏ విషయాలను ప్రస్తావించారు?

జ.ఇది పూర్తిగా స్వీయచరిత్ర. నా జీవితంలో జరిగిన మర్చిపోలేని కొన్ని సంఘటనలు ఇందులో పొందుపరిచా. వివిధ కోణాలను ఇందులో స్పృశించా. ఇన్నేళ్లుగా నా గేమ్ ప్రణాళికలో చదరంగం, కంప్యూటర్ ఎలాంటి మార్పులు తెచ్చాయో తెలిపా. చదరంగం గురించి తెలియని వాళ్లు కూడా ఈ పుస్తకాన్ని ఎంజాయ్ చేస్తారు.

ప్ర. మీ బయోపిక్​లో ఎవరు నటిస్తే బాగుంటుంది..

జ.బయోపిక్​ గురించి నేను ఆలోచించలేదు. ఒకవేళ ఎవరైన తీస్తే అందులో ఆమిర్ ఖాన్ నటిస్తే బాగుంటుందేమో.! ఎందుకంటే ఆమిర్​ చెస్ బాగా ఆడతాడు. ప్రస్తుతం పుస్తకం గురించే ఆలోచిస్తున్నా. ప్రజలు ఎలా స్పందిస్తారో చూడాలనుంది.

ప్ర. భవిష్యత్ ప్రణాళిక ఏంటి..?

జ.ఈ ఏడాదిలాగే 2020లోనూ టోర్నీలతో బిజీగా గడపబోతున్నా. అయితే కొన్ని విరామాలుంటాయి. ఏప్రిల్​లో జర్మనీ టోర్నమెంట్లో పాల్గోనబోతున్నా.

ప్ర. రిటైర్మెంట్ ప్లాన్ ఎప్పుడు..?

జ.ప్రస్తుతానికి ఏమీ అనుకోలేదు. వచ్చే ఏడాది కూడా టోర్నీలతో తీరిక లేకుండా గడపబోతున్నా. కనుక ముందే చెప్పలేను?. భవిష్యత్తే నిర్ణయిస్తుంది.

ఇటీవల చెన్నై వేదికగా 'మైండ్ మాస్టర్' పుస్తకాన్ని విడుదల చేశాడు విశ్వనాథ్. క్రీడాప్రముఖులు సుజాన్ నినాన్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

ఇదీ చదవండి:సచిన్​కు సలహా ఇచ్చిన వ్యక్తితో 'ఈటీవీ భారత్' ముఖాముఖి​

Last Updated : Dec 16, 2019, 11:52 AM IST

ABOUT THE AUTHOR

...view details