ఒలింపిక్స్లో రెండు సార్లు పతకాలు సాధించి.. మరోసారి విశ్వ క్రీడల్లో సత్తాచాటేందుకు సిద్ధమవుతున్నాడు భారత స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్. 2008 బీజింగ్ ఒలింపిక్స్లో కాంస్యం... 2012 లండన్ విశ్వక్రీడల్లో రజతం కైవసం చేసుకున్నాడు. ఇవి కాకుండా 2014, 18 కామన్వెల్త్ క్రీడల్లోనూ పసిడి సొంతం చేసుకున్న ఈ స్టార్ రెజ్లర్తో ఈటీవీ భారత్ ప్రత్యేకంగా మాట్లాడింది. ఆ విశేషాలు సుశీల్ మాటల్లోనే...
అందరూ సిద్ధంగా ఉన్నారు..
భారత్లో రెజ్లింగ్.. రోజురోజుకు ఆదరణ పెరుగుతోంది. చాలామంది ఈ క్రీడపై ఆసక్తి చూపిస్తున్నారు. 2020 టోక్యో ఒలింపిక్స్ కోసం రెజ్లర్లు ఇప్పటికే సన్నాహకాలు మొదలు పెట్టేశారు. అందరూ ఇందుకోసం సిద్ధంగా ఉన్నారు.
8 ఏళ్ల తర్వాత ఆడా..
ఇటీవల ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో ఆడా. ఈ టోర్నీలో 8ఏళ్ల విరామం తర్వాత పాల్గొన్నా. ఆ అనుభవం విభిన్నంగా ఉంది. అక్కడ చేసిన తప్పిదాలను నా కోచ్ గమనించాడు. అవి పునరావృతం కాకుండా కష్టపడుతున్నా. భవిష్యత్తులో ఇవి నాకు ఉపయోగపడతాయి.
తీవ్రంగా శ్రమిస్తున్నా..
ఒలింపిక్స్లో స్వర్ణం నెగ్గడమే నా లక్ష్యం. అందుకోసం తీవ్రంగా శ్రమిస్తున్నా. ఎవరు.. ఎంత సేపు ప్రాక్టీస్ చేయాలనేదానిపై నా కోచ్ ప్రణాళిక రూపొందిస్తాడు. ఆ ప్రకారం రోజుకు 45 నిమిషాల నుంచి 2 గంటల పాటు కష్టపడుతున్నా. ఆటలో యాక్టివ్గా ఉండేందుకు ఇది ఉపయోగపడుతుంది.
ఒలింపిక్స్ అర్హతలో ఫెడరేషన్దే అంతిమ నిర్ణయం..