దేశానికి పతకం తెచ్చేందుకు శ్రమించిన ఓ స్ప్రింటర్.. ప్రస్తుతం తన గ్రామంలో నీటి కష్టాలు ఎదుర్కొంటోంది. ట్రాక్‌పై పతకం కోసం పరుగెత్తిన ఆమె.. తాగునీటి కోసం బిందె పట్టుకొని నడుస్తోంది. ఏళ్లుగా తన గ్రామంలోని ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా తాజాగా 'ఈటీవీ భారత్'కు తన ఆవేదన చెప్పుకుంది స్టార్ అథ్లెట్ సరితాబెన్ గైక్వాడ్.
సరితాబెన్ స్వస్థలం.. గుజరాత్ డాంగ్ జిల్లాలోని ఖరాది అంబా గ్రామం. తమ ప్రాంతంలో ఎన్నో ఏళ్లుగా తీవ్ర నీటి ఎద్దడి ఉన్నట్లు చెప్పింది. ఈ నీటి సంక్షోభంపై ప్రభుత్వాలు స్పందించి సమస్య పరిష్కారం చేయాలని కోరింది.
"12 ఏళ్ల క్రితం నేను ఈ గ్రామంలో నివసించే సమయంలో ఐదు కిలోమీటర్లు నడిచివెళ్లి చిన్చలి గ్రామం నుంచి నీటిని తెచ్చేదాన్ని. కానీ, గత 8 సంవత్సరాలుగా నా చదువు కోసం హాస్టల్లో ఉంటున్నా. క్రీడల్లో మంచి ప్రదర్శన వల్ల మరో దేశాలలో శిక్షణ కోసం వెళ్లాను. దీని వల్ల మా గ్రామ ప్రజలు, నా కుటుంబ సభ్యులు పడుతున్న కష్టాలు నాకు తెలిసేవి కావు. ఇన్ని ఏళ్ల తర్వాత లాక్డౌన్ కారణంగా ఏప్రిల్ నుంచి ఇంటికే పరిమితమయ్యాను.ఇప్పటికీ ఆనాటి తాగునీటి సమస్య ఎదుర్కోవడం బాధగా ఉంది. గ్రామస్థులు ఇప్పటికీ కిలోమీటరు నడిచి వెళ్లి మంచినీటిని తెచ్చుకుంటున్నారు".
- సరితాబెన్ గైక్వాడ్, భారత అథ్లెట్
వర్షపాతం ఎక్కువే కానీ..