తెలంగాణ

telangana

ETV Bharat / sports

పోర్న్​స్టార్​గా మారిన మహిళా కార్ రేసర్ - Australian V8 Supercar driver Renee Gracie

తను ఎంతో ఇష్టపడ్డ కార్ రేసింగ్​ను వదిలిపెట్టి.. పోర్న్​స్టార్​గా మారింది. అసలు ఈ ఇండస్ట్రీలోకి ఎందుకు వచ్చింది? ఆమె తల్లిదండ్రులకు ఈ విషయం తెలుసా?

పోర్న్​స్టార్​గా మారిన మహిళా కార్ రేసర్
పోర్న్​స్టార్ రెనీ గ్రేస్

By

Published : Jun 9, 2020, 8:01 AM IST

ఆస్ట్రేలియాన్ కార్ రేసర్ రెనీ గ్రేస్.. తనకెంతో ఇష్టమై రేసింగ్​ను విడిచిపెట్టి కొన్నేళ్ల క్రితం పోర్న్​స్టార్​గా మారింది. 'ఓన్లీఫ్యాన్స్' వెబ్​సైట్​లోని పలు చిత్రాల్లో నటిస్తూ వారానికి రూ.18.8 లక్షలు గడిస్తోంది. అయితే తాను రేసింగ్ కెరీర్​ను వదిలి పోర్న్ ఇండస్ట్రీలోకి ఎందుకు రావాల్సి వచ్చిందో తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.

పోర్న్​స్టార్​ రెనీ గ్రేస్

"రేసింగ్​లో నేను సరైన ఫలితాలు సాధించలేకపోయాను. తద్వారా ఫండ్స్ తీసుకురాలేకపోయాను. నా వంతు ప్రయత్నించినా సాధ్యం కాకపోవడం వల్ల నా కెరీర్​ను విడిచిపెట్టాల్సి వచ్చింది. అయితే పోర్న్​ స్టార్​గా మారడం నా జీవితంలో జరిగిన మంచి విషయం. అది నాకు ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేసింది. ఇలా జరుగుతుందని అనుకోనప్పటికీ, ఈ పనిని ఆస్వాదిస్తున్నాను. నా దగ్గరున్న ఫొటోలు, వీడియోలు అమ్మి.. 30 ఏళ్ల ఇంటి లోన్​ను కేవలం 12 నెలల్లో తీర్చబోతున్నాను. పోర్న్​ గురించి నా కుటుంబానికి తెలుసు. ఈ విషయంలో మా నాన్న నాకు అండగా నిలిచాడు" -రెనీ గ్రేస్, మాజీ రేసర్

1998 తర్వాత సూపర్​కార్స్​కు పనిచేసిన పూర్తిస్థాయి మహిళా రేసర్ రెనీ గ్రేస్. అయితే 2017లో ఆమెకు రేసింగ్ ఫలితాలు అంతగా లేకపోవడం, ఫండ్స్ రాకపోవడం వల్ల కెరీర్​ను ముగించాల్సి వచ్చింది. ఆ తర్వాత స్థానికంగా ఉన్న కార్​ యార్డ్​లో పనిచేసిన రెనీ.. ఓన్లీఫ్యాన్స్ వెబ్​సైట్​ గురించి తెలుసుకుంది. అందులో తన న్యూడ్ ఫొటోలు, వీడియోలు అమ్మి.. తొలివారమే రూ.2.26 లక్షలు సంపాదించింది.

రేసర్​గా ఉన్నప్పుడు రెనీ గ్రేస్

ABOUT THE AUTHOR

...view details