కరోనా మహమ్మారి కారణంగా ఈ ఏడాదిలో జరగాల్సిన టోక్యో ఒలింపిక్స్.. 2021, జులైకి వాయిదా పడ్డాయి. ప్రస్తుత పరిస్థితిని చూస్తుంటే వచ్చే ఏడాదీ ఈ మెగా ఈవెంట్ జరిగే అవకాశాలు కనిపించడం లేదని చెబుతున్నారు జపాన్ వైరస్ నిపుణులు.
"కరోనా వైరస్ రోజు రోజుకు విస్తరిస్తోంది. ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో వచ్చే ఏడాది కూడా ఒలింపిక్స్ జరిగేలా కనిపించడం లేదు. రాబోయే వేసవి లోగా జపాన్ కరోనాను నియంత్రించొచ్చు. కానీ ప్రపంచంలో మిగిలిన దేశాలన్నీ ఈ వ్యాధి బారి నుంచి బయటపడతాయని చెప్పలేం. ఒలింపిక్స్ అంటే అన్ని దేశాలూ పాల్గొనాల్సిన పెద్ద క్రీడా సంబరం."
-కెంటారో ఇవాటా, జపాన్ ప్రొఫెసర్