బంతిపై లాలాజలం వినియోగంపై ఐసీసీ నిషేధం విధించిన నేపథ్యంలో.. వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో బంతి మెరుపు కోసం తాము చెమటనే ఉపయోగిస్తున్నట్లు ఇంగ్లాండ్ బౌలర్ మార్క్ వుడ్ తెలిపాడు.మ్యాచ్ ఆడే సమయంలో ఆటగాళ్ల మెడపై వీపులో ఎక్కువగా చెమట పడుతుంది. దాన్నే బంతిపై మెరుపు కోసం ఉపయోగిస్తున్నాం. అండర్సన్, ఆర్చర్ల సాయం తీసుకొని బంతికి చెమటతో మెరుపు తెప్పించే ప్రయత్నం చేశా అని వుడ్ తెలిపాడు.
'చెమటతో బంతికి మెరుపు తెప్పిస్తున్నాం' - England, west indies saliva ban
వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో బంతి మెరుపు కోసం చెమటను ఉపయోగిస్తున్నట్లు ఇంగ్లాండ్ బౌలర్ మార్క్ వుడ్ తెలిపాడు. కరోనా నేపథ్యంలో క్రీడా కార్యక్రమాలు మూడు నెలల పాటు నిలిచిపోయిన అనంతరం.. ఇంగ్లాండ్, వెస్టిండీస్ మధ్య తొలి టెస్టు సిరీస్ జరుగుతోంది.
!['చెమటతో బంతికి మెరుపు తెప్పిస్తున్నాం' England bowlers using back sweat to shine the ball](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7978955-358-7978955-1594433459214.jpg)
మార్క్ వుడ్
ఇంగ్లాండ్, వెస్టిండీస్ మధ్య జరుగుతోన్న తొలి టెస్ట్‌లో వెస్టిండీస్ జట్టు అధిక్యంలో ఉంది. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 204 పరుగులు చేయగా.. కరీబియన్ జట్టు 114 పరుగుల ఆధిక్యంలో ఉంది. ప్రస్తుతం రెండో ఇన్నింగ్స్ కొనసాగుతోంది.
ఇదీ చూడండి:సౌథాంప్టన్ టెస్ట్: విండీస్ 318 ఆలౌట్- ఇంగ్లాండ్‌పై ఆధిక్యం