టోక్యో వేదికగా ఈ ఏడాది జరగనున్న ఒలింపిక్స్‌కు.. తాజాగా ఎనిమిది మంది భారత బాక్సర్లు అర్హత సాధించారు. ఇందులో స్టార్ ప్లేయర్లు అమిత్ పంఘాల్, మేరీ కోమ్, సిమ్రన్‌జిత్ కౌర్‌తో పాటు పూజా రాణి, లవ్లీనా, వికాశ్, సతీష్, ఆశిష్ ఉన్నారు.
ఎనిమిది మంది భారత బాక్సర్లకు ఒలింపిక్స్ టికెట్లు
భారత బాక్సర్లు అంతర్జాతీయ వేదికపై మరోసారి సత్తా చాటారు. తాజాగా జోర్డాన్‌లోని అమ్మాన్ వేదికగా జరుగుతున్న ఆసియా ఒలింపిక్స్ క్వాలిఫయర్స్ టోర్నీలో మనోళ్లు అదరగొట్టేశారు. ఫలితంగా ఒకేసారి ఎనిమిది మంది టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించారు.
తాజాగా జరిగిన క్వాలిఫయింగ్ టోర్నీలో సిమ్రన్ జిత్(60 కేజీలు) సెమీఫైనల్ చేరింది. ఈ ప్రదర్శనతో టోక్యోకు అర్హత సాధించింది. తర్వాతి పోరులో షియివు(చైనీస్ తైపీ)తో తలపడనుంది. గతంలో లండన్ ఒలింపిక్స్‌కు ఇంతేమంది అర్హత సాధించారు.
మరో బాక్సర్ మనీశ్ క్వార్టర్ ఫైనల్లో 2-3 తేడాతో చిన్‌జోరిగ్(మంగోలియా)చేతిలో ఓడిపోయాడు. సచిన్ కుమార్(81 కేజీలు) విభాగంలో క్వార్టర్స్‌లో ఓడిపోయాడు. వీరిద్దరూ టబాక్సాఫ్' ద్వారా టోక్యో బెర్త్ దక్కించుకునేందుకు మరో అవకాశం ఉంది. వీళ్లకి టోక్యో టికెట్టు దక్కితే.. బౌక్సింగ్లో భారత ప్రాతినిధ్యం పదికి చేరనుంది.