తెలంగాణ

telangana

ETV Bharat / sports

ద్యుతీ చంద్​, హర్భజన్​ నామినేషన్ల తిరస్కరణ

ప్రతిష్ఠాత్మక అర్జున అవార్డు కోసం భారత అగ్రశ్రేణి స్ప్రింటర్​ ద్యుతీ చంద్​ దరఖాస్తును తిరస్కరించింది కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ. ఆమె రాష్ట్రమైన ఒడిశా ప్రభుత్వం ఆలస్యంగా నామినేషన్​ వివరాలు పంపడమే కారణమని వెల్లడించింది. ఖేల్​రత్న పురస్కారం కోసం పంజాబ్​ ప్రభుత్వం సిఫార్సు చేసిన హర్భజన్​ పేరునూ తోసిపుచ్చింది.

ద్యుతి చంద్​, హర్భజన్​ నామినేషన్లు తిరస్కరణ

By

Published : Jul 28, 2019, 9:10 AM IST

Updated : Jul 28, 2019, 10:39 AM IST

భారత స్టార్​ అథ్లెట్​ ద్యుతీ చంద్, క్రికెటర్​ హర్భజన్​కు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ షాకిచ్చింది. వారిద్దరూ భారత ఆటగాళ్లకిచ్చే అత్యున్నత పురస్కారాల కోసం చేసుకున్న దరఖాస్తులను తిరస్కరించింది. అర్జున కోసం ద్యుతీ, ఖేల్​ రత్న కోసం హర్భజన్​ పేర్లను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రానికి పంపాయి.

"గడువు ముగిసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు క్రీడాకారుల నామినేషన్లు పంపాయి అందుకే తిరస్కరించాం. ద్యుతీ చంద్​ విషయంలో అయితే ఆలస్యంగా పంపడమే కాకుండా.. ర్యాంకింగ్స్​ ప్రకారంపతకాలనుచేర్చకపోవడం మరో కారణం. భారత అథ్లెటిక్స్​ సమాఖ్య(ఏఎఫ్​ఐ)ను ఈ విషయంపై ప్రశ్నించాం. తర్వాత పంపిన జాబితాలోనూ ఆమెకు 5వ స్థానం కల్పించారు. అందుకే ఆమె నామినేషన్​ తిరస్కరించాం"

-- జాతీయ క్రీడా ప్రాధికార సంస్థ(శాయ్)

ఈ విషయంపై స్పందించిన ద్యుతీచంద్​.. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్​ పట్నాయక్​ను కలిసి మళ్లీ తన ఫైల్​ను పంపాలని అభ్యర్థించినట్లు తెలిపింది.

" నపోలీలోని వరల్డ్​ యూనివర్సిటీ గేమ్స్​లో గెలిచిన బంగారు పతకాన్ని ముఖ్యమంత్రి నవీన్​ పట్నాయక్​కు చూపించాను. నా ఫైల్​ మళ్లీ పంపాలని అభ్యర్థించాను. మరోసారి నా నామినేషన్​ పత్రాలను​ అర్జున అవార్డు కోసం పంపుతామని భరోసా ఇచ్చారు. తర్వాతి టోర్నీలపై దృష్టిపెట్టాలని సూచించారు. ఇంకా అర్జున అవార్డు విజేతలను ప్రకటించలేదు. నామినేషన్​ ఆలస్యం కావడానికి ఎన్నికలు(లోక్​సభ, విధానసభ), ఫొని తుఫానే కారణమని అనుకుంటున్నాను".
-- ద్యుతీ చంద్​, భారత క్రీడాకారిణి

నపోలీలో జరిగిన వరల్డ్​ యూనివర్సిటీ గేమ్స్​లో.. 100 మీటర్ల పరుగును 11.32 సెకన్లలో పూర్తి చేసి పసిడి కైవసం చేసుకుంది ద్యుతీ. ఇంతే దూరాన్ని 11.24 సెకన్లలో పూర్తిచేసిన జాతీయ రికార్డు ఆమె సొంతం. ఖేల్​రత్న పురస్కారం కోసం క్రికెటర్ హర్భజన్​ పేరును పంజాబ్​ ప్రభుత్వం సిఫార్సు చేసింది. ఆ రాష్ర విజ్ఞప్తినీ తోసిపుచ్చింది క్రీడా మంత్రిత్వ శాఖ.

క్రికెటర్​ హర్భజన్​ సింగ్​
Last Updated : Jul 28, 2019, 10:39 AM IST

ABOUT THE AUTHOR

...view details